తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సంచలన ట్వీట్ చేశారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణ పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనంగా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. సమతా మూర్తి స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధమని మండిపడ్డారు కేటీఆర్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ట్యాగ్ తో ఈ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జ్వరం కారణంగా ఈ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరమయ్యారు.
దీంతో తెలంగాణ బిజెపి నాయకులు, టిఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ప్రధాని వచ్చిన నేపథ్యంలో సీఎం హోదాలో ఉండి కేసీఆర్ ఎందుకు రాలేదని బిజెపి నాయకులు మండిపడుతున్నారు. అయితే కరోనా సమయంలో… కచ్చితంగా పోవాల్సిన నియమాలు లేదని కేంద్ర హోం శాఖ చెప్పినట్టు టిఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ సమంతా మూర్తి విగ్రహావిష్కరణ పై వివాదాస్పద కామెంట్లు చేశారు.
Icon of Partiality unveiled #StatueOfEquality
And Irony just died a billion deaths!!
— KTR (@KTRTRS) February 6, 2022