సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ అర్వింద్‌

-

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను వరంగల్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సభలో పాల్గొన్న నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా పూర్తైందని అన్నారు. రాష్ర్టంలో టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు ఎంపీ అర్వింద్‌. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని అన్నారు ఎంపీ అర్వింద్‌. హన్మకొండలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ర్ట ప్రభుత్వంపై ఎంపీ అర్వింద్ నిప్పులు చెరిగారు. మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్… బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన విమర్శలను ఎంపీ అర్వింద్ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ రాష్ర్ట ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ఎంపీ అర్వింద్ కొన్ని ప్రశ్నలు వేశారు ఎంపీ అర్వింద్‌.

Nizamabad: MP Arvind questions KCR how he spent Central funds

వరి వేస్తే ఉరి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా..? 2021 వరకూ కోటి 42 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కావాలా..? అని ప్రశ్నించారు. భారీ వర్షాలు, వరదలతో పంటలు కొట్టుకుపోతే పట్టించుకోని సీఎం కేసీఆర్ కావాలా..? లేక ఫసల్ బీమా పథకంతో రైతులను ఆదుకుంటున్న మోడీ కావాలా..? నిరుపేదలకు, ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇంట్లు కట్టించి, ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ కావాలా..? లేక దేశంలోని నిరుపేదల మహిళలకు3 కోట్ల 20 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చిన మోడీ కావాలా..? కరోనా సమయంలో నిరుపేద, సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఎటువంటి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టని సీఎం కేసీఆర్ కావాలా..? లేక 20 కోట్లకు పైగా కుటుంబాలను ఆదుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిన మోడీ కావాలా..? అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news