సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాదెండ్ల మనోహర్..

-

ఏపీ సీఎం జగన్ నేడు గణపపురంలో ఈ ఏడాది మొదటి విడుత రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా.. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం జగన్ దత్త పుత్రుడు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు సంధించారు. అయితే ఈ నేపథ్యంలో.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కల్యాణ్ నుంచి సాయం అందుకున్నవారు కౌలు రైతులు కాదని చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు నాదెండ్ల.

- Advertisement -

Nadendla Manohar slams AP govt. over arrest of Jana Sena leaders protesting  for job recruitments

పవన్ కల్యాణ్ అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించారని, 200 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించారని వెల్లడించిన నాదెండ్ల.. ఆ 200 మంది కౌలు రైతులు కాదని జగన్ చెప్పగలరా? వారికి సంబంధించిన వివరాలను పోలీసులు తమ రికార్డుల్లో ఏంరాశారో చూపిస్తే సీబీఐ దత్తపుత్రుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రైతులను మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు జగన్ ను మించినవాళ్లు ఉండరని నాదెండ్ల విమర్శించారు. వాస్తవంగా వైసీపీ చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్రం ఇచ్చే నిధులు కలుపుకుంటే ఒక్కో రైతుకు రూ.19,500 రావాలని, కానీ రాష్ట్రంలో ఇస్తున్నది రూ.13,500 మాత్రమేనని వివరించారు. ఆ లెక్కన ఒక్కో రైతు మీద జగన్ ప్రభుత్వం రూ.6 వేలు మిగుల్చుకుంటోందని నాదెండ్ల ఆరోపించారు. రైతు బిడ్డనని చెప్పుకుంటున్న జగన్, రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సిగ్గుచేటని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...