ఫిల్మ్ నగర్ టాక్: టాలీవుడ్ కి “కొత్త కరోనా” టెన్షన్!

-

ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ వణికిపోయింది! చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలనే తేడా లేకుండా కరోనా దెబ్బ అందరిపైనా పడింది. ఆ ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్ కి పవన్ మాటల రూపంలో కొత్త కరోనా వచ్చిందని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారంట! అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వానికి ఒకరితర్వాత ఒకరు పూర్తిగా సరెండర్ అవుతున్నారని టాక్స్ నడుస్తున్నాయి!

corona
corona

అవును… అసలే కరోనా దెబ్బతో విలవిల్లాడిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు మరో దెబ్బగా మారే ప్రమాధం లేకపోలేదనేది ఇండస్ట్రీ పెద్దల భావనగా ఉందంట. అందులో భాగంగా… ప్రభుత్వంపై పవన్ విమర్శలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన దిల్ రాజు.. ఇప్పటికే మంత్రి పేర్ని నానీని కలుసుకున్నారు. చెప్పాల్సిందంతా చెప్పుకున్నారు. పవన్ ప్రసంగానికి తనను బలిచేయొద్దన్న రేంజ్ లో వేడుకున్నారు!

అయితే… ఈ సమయంలో “సినిమాలు విడుద‌ల చేయ‌డానికి కొన్ని ఇబ్బందులున్నాయి.. వాటిని ప‌రిష్క‌రించాల‌ని ముఖ్య‌మంత్రిని కోరుతున్నాను.. రాజు త‌లుచుకుంటే వ‌రాల‌కు కొద‌వా? ద‌య‌చేసి చిత్ర‌ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుని, వెసులుబాటు క‌ల‌గ‌జేయాలి.. దీన్ని ఇండ‌స్ట్రీ విన్న‌పంగా తీసుకుని, సాయ‌ప‌డ‌తార‌ని కోరుకుంటున్నా” అని అల్లు అర‌వింద్, ఏపీ సీఎం జ‌గ‌న్‌ ను వేడుకున్నారు!

ఎందుకంటే… ఇప్పటికే పరిశ్రమను కాస్త టైట్ చేశారు జగన్. దీంతో ఇండస్ట్రీ విలవిల్లాడిపోతోన్న పరిస్థితి. కక్కలేక మింగలేక ఉన్న కొంతమంది పెద్దలు.. జగన్ సర్కార్ కు తలొంచకతప్పని పరిస్థితి. అవంటే సామరస్యపూర్వక వాతావరణంలో ఏదోలా సవరణలు చేయించుకోవచ్చని భావించిన పెద్దలకు పవన్ దెబ్బకొట్టారు. దీంతో ఇప్పుడు పవన్ దెబ్బతో జగన్ సర్కార్ ఇంకెంత టైట్ చేస్తుందో అనే కంగారు పట్టుకుందట. దానిఫలితమే ఈ వరుస రిక్వస్ట్లు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

అయితే ఈ రికవస్టులు ఇకపై చిరంజీవి, మోహన్ బాబు, సురేష్ బాబు, కృష్ణంరాజు లాంటి వ్యక్తుల నుంచి కూడా రావొచ్చని… ఇప్పటివరకు ఎవరైతే ఓ టీమ్ గా ఏర్పడి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారో.. వాళ్లకు అదనంగా మరికొంతమందిని రాయబారం కోసం పంపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది!

ఏది ఏమైనా… ఇన్నాళ్లూ మావాడు, మనవాడు అనుకున్న ఇండస్ట్రీకి పవన్ పెద్ద దెబ్బే కొట్టారని – జగన్ కు ఇండస్ట్రీని సరేండర్ చేసేశారని.. ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారనేది ఫిల్మ్ నగర్ లేటేస్ట్ టాక్ అంట!!

Read more RELATED
Recommended to you

Latest news