నాన్నకు ప్రేమతో సినిమాలో.. తన తండ్రికి ఉన్న పగని ఎన్టీఆర్ ఎలా తీర్చారో..అలాగే జగన్ పై చంద్రబాబుకు ఉన్న పగని పవన్ తీర్చేలా ఉన్నారు. అందుకే బాబుకు ప్రేమతో అనే టైటిల్ వచ్చిందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసి వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు..జగన్ టార్గెట్ గా ఎలా రాజకీయం చేస్తున్నారో తెలిసిందే…జగన్ ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శిస్తున్నారు..అసలు జగన్ ఏం చేసిన బాబు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. బాబు ఆతృత అంతా ఒక్కటే…ఎలాగైనా జగన్ ని గద్దె దించేయాలని, తాను అధికారంలోకి రావాలని.
ఇదే కాన్సెప్ట్ తో బాబు పనిచేస్తున్నారు…ఇక బాబుకు పరోక్షంగా పవన్ సపోర్ట్ చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. ఆయన కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు గ్యాప్ దొరికినప్పుడల్లా జగన్ పై ఫైర్ అవుతున్నారు. అయితే మూడో ఫోర్స్ గా జనసేనని నిలపాలని అనుకుంటున్న పవన్..కేవలం వైసీపీపై విమర్శలు చేస్తే సరిపోదు. టీడీపీని కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. వైసీపీ-టీడీపీల కంటే తాము బెటర్ అని చెప్పుకోవాలి.
కానీ పవన్ అలా చేయడం లేదు…కేవలం వైసీపీపైనే విమర్శలు చేస్తారు..జగన్ నే విమర్శిస్తారు…టీడీపీని గాని, చంద్రబాబుని గాని ఒక్క మాట అనరు. అలాంటప్పుడు జనసేన ఎందుకు పికప్ అవుతుంది…అసలు ఆ పార్టీని ప్రజలు ఆదరించడం కష్టం. పవన్…జగన్ పై విమర్శలు చేయడం వల్ల…జనసేనకు ఎంత ప్లస్ అవుతుందో తెలియదు గాని, టీడీపీకి మాత్రం బాగానే ప్లస్ అవుతుంది.
తాజాగా ఇండిపెండెన్స్ డే నాడు కూడా పవన్…జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వరు అంటారు…కానీ జనసేనని ఆదరించాలని అంటారు. పైకి జనసేనని ఆదరించాలని చెబుతూనే…లోపల బాబు బలపడాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఏదేమైనా బాబుని సీఎం చేసే వరకు పవన్ నిద్రపోయేలా లేరు.