జై జ‌గ‌న్ : డిజిట‌ల్ వాకిట నేను ఉన్నాను నేను విన్నాను

-

నేను ఉన్నాను నేను విన్నాను అని నిన్న‌మొన్న‌టి ఎల‌క్ష‌న్లో జ‌గ‌న్ చెప్పిన డైలాగ్ మార్మోగి పోయింది. అదే డైలాగ్ కు కొన‌సాగింపుగానే పాల‌న ఉంది. పాల‌న‌కు సంబంధించిన సంస్క‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇవ‌న్నీ రేప‌టి వేళ మంచి ఫ‌లితాలు ఇవ్వాలంటే డిజిటల్ వేదిక‌ల‌పై కూడా ప్రచారం ఎంతో అవ‌సరం. చేసిన మంచిని చెప్పుకోవ‌డంలో త‌ప్పేం లేదు అన్న‌ది జ‌గ‌న్ అభిప్రాయం. ఇందులో భాగంగా వాట్సాప్ తో ఏపీ స‌ర్కారు అనుసంధానితం అవుతోంది.

ఏపీ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి, వాటికి ఉన్న అవ‌స‌ర‌త‌కూ విస్తృతంగా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న గొంతుక‌ను వాట్సాప్ వేదిక‌గా కూడా వినిపించాలి అని భావిస్తోంది. వాట్సాప్ తో టై అప్ అయి త్వ‌ర‌లో పథ‌కాల ప్ర‌చారాన్ని వినూత్న రీతిలో చేయ‌నుంది. వాస్త‌వానికి చాలా ప్ర‌భుత్వ ప‌థ‌కాలపై ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న లేదు అన్న‌ది ఓ వాస్త‌వం.

ముఖ్యంగా ల‌బ్ధి పొందిన వారు మిన‌హా మిగ‌తా వారికి కూడా వీటిపై అవ‌గాహ‌న ఉంటే మేలు అన్న‌ది అంగీక‌రించ‌ద‌గ్గ నిజం. ఎందుకంటే రేప‌టి వేళ ఎవ‌రికైనా వివ‌రించేందుకు, సంబంధిత ప‌థ‌కాల వ‌ర్తింపున‌కూ ఈ పాటి అవ‌గాహ‌న అన్న‌ది ఎంతో మేలు చేస్తుంది. కొన్ని సార్లు కొన్ని ప‌థ‌కాలు త‌మ‌కు అంద‌డం లేదు అన్న అపోహ కూడా ఉంది. దీనిపై కూడా క్లారిఫికేష‌న్ ను ఎప్ప‌టిక‌ప్పుడు అధికారులు ఇస్తున్నా, క్షేత్ర స్థాయిలో వ‌లంటీర్లు వివ‌రిస్తున్నా కొన్ని సార్లు ఫలితాలు రావ‌డం లేదు. అందుకే డిజిట‌ల్ ప్ర‌మోష‌న్ తో  కొంత వ‌ర‌కూ అపోహ‌ల‌ను నివారించ‌డం కానీ నిలువ‌రించ‌డం కానీ సాధ్యం అని స‌ర్కారు భావిస్తోంది.
ఒక్క ప‌థ‌కాలు అనే కాదు మిగిలిన నిర్ణ‌యాలు, వాటి ఫ‌లితాలు, జిల్లాల అభివృద్ధికి సంబంధించి వివ‌రాలు వాటి విశేషాలు ఇవ‌న్నీ కూడా ఒక్క క్లిక్ దూరంలోనే అందుబాటులో ఉంచేందుకు స‌ర్కారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు త్వ‌ర‌లోనే ఫ‌లించ‌నున్నాయి.ఇప్ప‌టికే ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ ను లీడ్ చేస్తున్న  వాసుదేవ‌రెడ్డి ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు.ఆయ‌న సైతం ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.
డిజిట‌ల్ విప్లవం వ‌చ్చిన ద‌రిమిలా అందరికీ దాదాపు నెట్ సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చింది అని, అయిన‌ప్ప‌టికీ స‌ర్కారు చెప్పాల‌నుకున్న వాటిపై అదేవిధంగా చేస్తున్న మంచిపై కొన్ని అపోహ‌లు విప‌క్షాలు సృష్టిస్తున్నాయ‌ని అలాంటి వాటిని నియంత్రించేందుకు ఇటువంటి వాట్సాప్ సేవ‌లు స‌మూహాల్లో మంచి మార్పుల‌కు కార‌ణం అవుతాయి అని స‌ర్కారు వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా రాంగ్ ఇన్ఫ‌ర్మేష‌న్, ఫేక్ ల గోల అన్న‌ది ఇక‌పై ఉండ‌కుండా ఉండేందుకు ఓ అవ‌కాశం ఇది అని కూడా చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news