బైపోల్ వార్: హరీష్ అవుట్..కేటీఆర్ ఇన్?

-

తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ హరీష్ రావు గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు…తనదైన శైలిలో రాజకీయం చేస్తూ…పార్టీని కష్టకాలం నుంచి బయటపడేస్తారు. అలాగే పార్టీ గెలుపులో హరీష్ కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే ఇంతకాలం హరీష్ రాజకీయం బాగానే వర్కౌట్ అయింది…కానీ దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో హరీష్ స్ట్రాటజీలు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు.

రెండు ఎన్నికల్లో ఇంచార్జ్ గా పనిచేసిన హరీష్ కు చేదు అనుభవమే మిగిలింది…రెండు చోట్ల టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక ఇంచార్జ్ పై టీఆర్ఎస్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సారి హరీష్ రావుకు బాధ్యతలు ఇవ్వకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ సారి మునుగోడులో గెలవడం టీఆర్ఎస్ పార్టీకి చాలా ముఖ్యం…ఈ సారి గాని తేడా కొడితే…సాధారణ ఎన్నికలపై బాగా ప్రభావం పడుతుంది..అప్పుడు టీఆర్ఎస్ గెలుపు చాలా కష్టమవుతుంది.

అందుకే ఈ సారి మునుగోడు ఉపఎన్నిక విషయంలో కేసీఆర్ ఆచి తూచి అడుగేస్తున్నారు. అయితే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం కష్టమే అని తెలియడంతోనే హరీష్ కు బాధ్యతలు ఇచ్చారనే టాక్ కూడా ఉంది. కానీ సారి మునుగోడులో పరిస్తితి వేరేగా ఉండొచ్చని టీఆర్ఎస్ వార్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన రెండు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఎన్నికల్లో గెలిచింది.

ఇదే క్రమంలో మునుగోడులో కూడా గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటుంది. అయితే ఈ సారి హరీష్ రావుని కాకుండా కేటీఆర్ ని ఇంచార్జ్ గా పెట్టాలనేది కేసీఆర్ ఆలోచన అని తెలుస్తోంది. గతంలో ఆయన పాలేరు ఉపఎన్నిక బాధ్యతని తీసుకుని, అక్కడ పార్టీ గెలుపుకు కృషి చేశారు. అలాగే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ ని ఈ సారి మునుగోడు ఉపఎన్నికల ఇంచార్జ్ గా పెట్టొచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news