బొత్స అడ్డాపై బాబు ఫోకస్..ఈజీ కాదా?

-

ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు…తెలుగు ప్రజలకు బొత్స పేరు సుపరిచితమే…ఎన్నో ఏళ్ల నుంచి బొత్స ఏపీ రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు…గతంలో కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకుల్లో ఒకడిగా ఉన్నారు…పి‌సి‌సి అధ్యక్షుడుగా, మంత్రిగా పనిచేశారు..ఒకానొక సమయంలో సీఎం రేసులోకి కూడా వచ్చారు. ఇక అలాంటి నాయకుడు రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోని పోటీ చేసి ఓట్లు బాగానే తెచ్చుకున్నారు.

కానీ కాంగ్రెస్ లో ఉంటే లాభం లేదని చెప్పి..వైసీపీలోకి వచ్చి…2019 ఎన్నికల్లో సత్తా చాటి…మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే బొత్స లాంటి నాయకులకు రాజకీయంగా చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు…అందులోనూ బొత్స..తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు…2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోతే…బొత్స మాత్రం చీపురుపల్లిలో టీడీపీకి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. 2019 లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

అయితే ఇప్పుడు బొత్స అడ్డాపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు…చీపురుపల్లిలో టీడీపీని బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం చీపురుపల్లి ఇంచార్జ్ గా కిమిడి నాగార్జున పనిచేస్తున్న విషయం తెలిసిందే…గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి నాగార్జున ఎఫెక్టివ్ గానే పనిచేస్తున్నారు. కాకపోతే ఎంత పని చేసిన చీపురుపల్లిలో పికప్ కాలేకపోతున్నారు. బొత్స బలాన్ని తగ్గించలేకపోతున్నారు..రాష్ట్రంలో ఎక్కడకక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంటే…బొత్సపై మాత్రం అలాంటిది కనిపించడం లేదు.

అందుకే బొత్స బలాన్ని తగ్గించడం కోసం…బాబు చీపురుపల్లిలో ఎంట్రీ ఇచ్చారు..రోడ్ షోలు పెట్టి కార్యకర్తలని ఇంకా ఉత్సాహపరుస్తున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు…అయితే ఎంత చేసిన చీపురుపల్లిలో బొత్సని ఓడించడం సాధ్యమయ్యే పని కాదని చెప్పొచ్చు…చూడాలి మరి బాబు ఎంతవరకు బొత్సని నిలువరించగలుగుతారో.

Read more RELATED
Recommended to you

Latest news