హుజూరాబాద్‌లో ఊహించని సర్వే…లీడ్ ఎవరిదంటే?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి తెలంగాణ ప్రజల్లో బాగా పెరిగిపోయింది. నోటిఫికేషన్ రాకపోయినా సరే హుజూరాబాద్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగురుతుందా? లేక మొన్నటివరకు కేసీఆర్ కుడి భుజంగా వ్యవహరించి, ఇప్పుడు బయటకొచ్చి బీజేపీ తరుపున బరిలో నిలబడిన ఈటల రాజేందర్ గెలుస్తారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

ఇక వీరి మధ్యలో కాంగ్రెస్ ఏ మేర సత్తా చాటుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ప్రధాన పోటీ ఈటల, టీఆర్ఎస్‌ల మధ్యే నడుస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సొంతంగా బీజేపీకి పెద్ద సీన్ లేదు. అందుకే ఈటల తన సొంత బలంతోనే పోరాడుతున్నారు. అయితే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో అనేక సర్వేలు వస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే సంస్థలు హుజూరాబాద్‌లో మకాం వేసి ప్రజల నాడీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే పలు సర్వేలు ఈటల రాజేందర్‌కు మద్ధతుగా వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ఈటలకే గెలిచే అవకాశాలున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మరో సంస్థ హుజూరాబాద్‌లో సర్వే చేస్తుండగా, ఆ సర్వేకు సంబంధించిన ఓ షీట్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. ఒమార్గ్ అనే సర్వే సంస్థకు సంబంధించిన షీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అందులో పలు ప్రశ్నలు సంధించి, ప్రజల దగ్గర నుంచి సమాధానాలు రాబడుతున్నారు.

ఇందులో ఒక ప్రశ్న వచ్చి ‘రాబోయే ఉపఎన్నికలో మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుందనుకుంటున్నారని ఉంది. దాని ఈటల రాజేందర్ వద్ద టిక్ పెట్టి ఉంది. అంటే పరోక్షంగా ఇక్కడ ఈటల గెలవబోతున్నారనే సంకేతాలు ఆ సర్వే సంస్థ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఈ సర్వేలు ఏ మేర నిజమవుతాయో?