తారక్‌తో టీడీపీలో చీలిక…సాధ్యమయ్యేనా?

-

తెలంగాణలో ఎలాగో టీడీపీ కథ ముగిసింది…ఇక ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఇక టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించేయాలని డిమాండ్లు వచ్చాయి. లోకేష్ కు పార్టీ నడిపించే సత్తా లేదు..చంద్రబాబుకు వయసు అయిపోయింది కాబట్టి…సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పజెప్పాలని టీడీపీలో కొందరు కార్యకర్తలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

ఎలాగో ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు పార్టీని తీసుకున్నారు కాబట్టి…ఇప్పుడు జూనియర్ చేతుల్లో పార్టీ పెట్టాలని అన్నారు. అయితే ఎప్పుడు ఏదొకవిధంగా జూనియర్ మద్ధతుదారులు టీడీపీలో డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా ముందుకెళుతున్నారు. ఇలాంటి తరుణంలోనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ కావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ మద్ధతు తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలం పెంచుకోవాలనేది అమిత్ షా ఆలోచనగా ఉంది. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతూ వస్తుంది…అయితే అధికారంలోకి రావాలంటే అక్కడ టీఆర్ఎస్ వైపు వెళ్ళిన టీడీపీ శ్రేణుల సపోర్ట్ కావాలి..ఇటు ఏపీలో బీజేపీ బలపడాలన్న టీడీపీ సపోర్ట్ కావాలి. కానీ చంద్రబాబు అంటే మోదీ, షాలకు పడని పరిస్తితి.

అయినా టీడీపీ సపోర్ట్ ఉంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలం పెరుగుతుంది. అలా అని బాబుని సపోర్ట్ అడిగి…ఆయన్ని హైలైట్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. అందుకే ఎన్టీఆర్ రూపంలో బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్ చేసిందని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ ద్వారా…టీడీపీలో చీలిక తీసుకొచ్చి..రానున్న రోజుల్లో రాజకీయంగా లబ్ది పొందాలనేది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకుంటే…ఎంతో కొంత టీడీపీ మద్ధతుదారుల సపోర్ట్ దొరికినట్లే అని భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ని షా కలవడంపై టీడీపీ నేతలు గాని, కార్యకర్తలు గాని స్పందించడం లేదు. మొత్తానికి టీడీపీని ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చేలా చేసి..ఆ తర్వాత తమ బలం పెంచుకోవాలనేది బీజేపీ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news