కొత్త కథ: నాగార్జున ఎంపీ?

-

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడు ఏదొక సెన్సేషనల్ అంశం తెరపైకి వస్తూనే ఉంటుంది…ఇక అందులో నిజనిజాలు ఎలా ఉన్నా సరే…ఆ అంశం మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిపోతుంది. ఇటీవల అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందో ఎవరికి క్లారిటీ లేదు. అధికారికంగా మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి మాత్రమే వచ్చిందని బయటకొచ్చింది. అయితే ఇది కూడా నిజమని అనుకోవడానికి లేదు.

మొత్తం మీద చూస్తే అక్కడ నిజమెంత ఉందో తెలియదు గాని వారి చర్చపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి…కామెంట్లు వచ్చాయి. ఎన్టీఆర్-బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారని, బీజేపీ సపోర్ట్‌తో టీడీపీ పగ్గాలు తీసుకుంటున్నారని..ఇలా రకరకాల ప్రచారం వచ్చింది. కానీ వీటిలో వాస్తవం ఎవరికి తెలియదు. ఇక ఇదే క్రమంలో తాజాగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త కథ ఒకటి పుట్టుకొచ్చింది.

అది ఏంటంటే…సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సీనియర్ హీరోల్లో ఒకరిగా ఉన్న నాగార్జున…వైసీపీ తరుపున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్నారని. ప్రస్తుతం విజయవాడలో టీడీపీ బలంగా ఉంది..పైగా అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎంపీ. అలాగే ఇక్కడ కమ్మ వర్గం ప్రభావం ఎక్కువ. అందుకే అదే వర్గానికి చెందిన, క్రేజ్ ఉన్న నాగార్జునని విజయవాడలో నిలబెడుతున్నారని మీడియాలో కథనాలు వచ్చేశాయి.

మరి ఈ కథనాల్లో నిజమెంత ఉందంటే…నిజం పెద్దగా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి నాగార్జున సినీ హీరోతో పాటు…ఒక బిజినెస్మెన్.. ఇలా వ్యాపార రంగంలో ఉండే వ్యక్తి…అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి పేరు పోగొట్టుకోరు. అన్నీ తెలిసిన నాగార్జునకు విజయవాడలో రాజకీయ పరిస్తితులు తెలియకుండా ఉండవు…అక్కడ టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. గతంతో పోలిస్తే ఇంకా బలపడింది..అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి రిస్క్ ఉన్న చోట నాగార్జున బరిలో ఉండటం కష్టమైన పని. ఇప్పుడు రాజకీయాల్లో సినీ చరిష్మా ఎక్కువ పనిచేయదు. కాబట్టి నాగార్జున అంత తేలికగా ఎంపీగా పోటీ చేయడం కష్టం. కానీ జగన్‌కు సన్నిహితుడు కాబట్టి…వైసీపీకి పరోక్షంగా సపోర్ట్‌గా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news