గ్రేటర్‌లో కారు జోరు..ఆ సీట్లలో డౌట్ లేనట్లేనా.!

-

గ్రేటర్‌లో కారు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక్కడ తెలంగాణ మాత్రమే కాదు..ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. వారే గెలుపోటములని తారుమారు చేస్తారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 24 సీట్లు ఉన్నాయి. వీటిల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుంటే అధికారంలోకి రావడం సులువు అని ప్రతి పార్టీ భావిస్తుంది. అందుకే గ్రేటర్ పై ఎక్కువ గురి పెడతారు.

అయితే గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ..గ్రేటర్ లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది..ఎం‌ఐ‌ఎం 7 సీట్లు గెలుచుకోగా, మిగిలిన మెజారిటీ సీట్లలో బి‌ఆర్‌ఎస్ పాగా వేసింది. ఇక ఈ సారి కూడా ఆయా సీట్లలో సత్తా చాటాలని బి‌ఆర్‌ఎస్ చూస్తుంది. ఇందులో ఎం‌ఐ‌ఎం పార్టీకి చెందిన 7 సీట్లు పక్కన పెట్టాల్సిందే. చాంద్రాయణగుట్ట, నాంపల్లి, కార్వాన్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, ఛార్మినార్, మలక్‌పేట్ సీట్లు ఎం‌ఐ‌ఎంకే దక్కడం ఖాయమే. అవి కాకుండా మిగిలిన సీట్లపై బి‌ఆర్‌ఎస్ ఫోకస్ చేసింది.

ఈ సారి కూడా మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో గ్రేటర్ లో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటడం అనేది అంత సులువు కాదు..ఇప్పుడు బి‌జే‌పి, కాంగ్రెస్ రేసులోకి వచ్చాయి. ఆ రెండు పార్టీలని నిలువరించాల్సిన అవసరం ఉంది. మెజారిటీ సీట్లు దక్కించుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో గ్రేటర్ లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సీట్లు..జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ముషీరాబాద్ లాంటి సీట్లు బి‌ఆర్‌ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి.

ఈ సీట్లలో కాంగ్రెస్, బి‌జే‌పి కూడా రేసులోకి వస్తున్నాయి. కాబట్టి బి‌ఆర్‌ఎస్ పార్టీ పట్టు వదలకుండా ముందుకెళ్లాలి. అప్పుడే గ్రేటర్ లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోగలదు.

Read more RELATED
Recommended to you

Latest news