పోటాపోటి: ట్రైయాంగిల్ ఫైట్… హాంగ్?

-

తెలంగాణ రాజకీయాల్లో ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే..టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య ముక్కోణపు పోరు జరుగుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో మూడు పార్టీల మధ్య హోరాహోరీగా రాజకీయం జరుగుతుంది….ఇక ఎప్పుడు ఏ పార్టీ లీడ్ లోకి వస్తుందో క్లారిటీ లేకుండా ఉందని ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో తెలుస్తోంది. ఇక ప్రశాంత్ కిషోర్ టీం టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ టీం ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేస్తూ…టీఆర్ఎస్ పరిస్తితి ఎలా ఉందనే సమాచారం కేసీఆర్ కు అందిస్తుంది. ఇప్పటికే పలు సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని తేలిన విషయం తెలిసిందే..అలాగే టీఆర్ఎస్ లోని 40 మంది పైనే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందని, వారు మళ్ళీ గెలవడం కష్టమని, కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో వారిని కేసీఆర్ పక్కన పెట్టనున్నారని కథనాలు కూడా వచ్చాయి.

ఇక ఆ మధ్య వచ్చిన సర్వేలో టీఆర్ఎస్ పార్టీకే లీడ్ ఉందని, కాంగ్రెస్ రెండో ప్లేస్ లో, బీజేపీ మూడో ప్లేస్ లో ఉందని కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఓ సర్వే తెలంగాణ పోలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా పీకే టీం సర్వే అని కథనాలు వస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 40-45 సీట్లు వరకే గెలుచుకుంటుందని తేలిందని ప్రచారం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉందని, మూడో ప్లేస్ లో బీజేపీ ఉందని చెబుతున్నారు..అయితే మూడు పార్టీల మధ్య సీట్ల తేడా గాని, ఓట్లు తేడా గాని పెద్దగా లేదని తెలుస్తోంది.

అంటే ఎవరికి లీడ్ వచ్చే అవకాశం కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది…ఎన్నికల నాటికి పరిస్తితి పర్లేదు అని లేదంటే తెలంగాణలో హాంగ్ వచ్చే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మారుతాయో?

Read more RELATED
Recommended to you

Latest news