జగన్ అదే మాట..ఇంకా దుష్టచతుష్టయంతో భయమేలా!

-

గత కొంతకాలం నుంచి జగన్ భారీ సభలతో జనంలోకి వస్తున్నారు. పథకాల ప్రారంభం కావాచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థపనలు కావచ్చు..వరుసగా జిల్లాగా పర్యటనలు చేస్తున్నారు. ఇక జగన్ సభలకు వైసీపీ నేతలు..భారీగా జనాలని తరలిస్తున్నారు. ఇక సభల్లో  భారీ స్థాయిలో జనం ఉంటున్నారు. అయితే ప్రతి సభలోనూ జగన్ చెప్పేది ఒకటే..తాను జనాలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం అడ్డుకుంటుందని, ప్రతి ఇంటికి మంచే చేశానని, మంచి జరిగితే తోడుగా ఉండాలని కోరుతున్నారు.

తాజాగా జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని మదనపల్లెలో బటన్ నొక్కి విద్యార్ధులకు డబ్బులు వేశారు. ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ.. బటన్ నొక్కి ప్రజలకు మంచి చేస్తూంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తున్నారని, గత పాలకులు అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కి డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ఆనయ ప్రశ్నించారు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోవాలని ప్రజల్ని కోరారు.  తనకు పొత్తు ప్రజలతోనేనని అన్నారు. వాళ్ల మాదిరిగా టీవీ చానళ్లు, పేపర్లు, దత్తపుత్రుడు తోడుగా లేరన్నారు. చెప్పింది తప్పకుండా చేస్తానని.. మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 98 శాతం నేరవెర్చామన్నారు.

అయితే ఈ మాటలు జగన్ ప్రతి సభలోనూ చెబుతున్నారు. తాను అంతా మంచి చేశానని నమ్ముతున్నప్పుడు దుష్టచతుష్టయం అని చెప్పి..చంద్రబాబు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5.. దత్తపుత్రుడు అని పవన్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు..ప్రతిపక్షం ఏదో చేసేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుందో లేదో..ప్రజలు ఆలోచించుకుంటారు.

ఇక పదే పదే తమకు సొంత మీడియా లేదని అంటారు..మరి ఈ మాటలని జనాలు నమ్ముతారా? అంటే వైసీపీకి అనుకూలంగా కళ్ళకు కనిపించే చానల్స్ చాలా ఉన్నాయి. సాక్షి సొంత మీడియా..ఇంకా ఏ ఏ చానల్స్ వైసీపీ అనుకూలంగా ఉన్నాయో అందరికీ తెలుసు. చివరిగా బటన్ నొక్కుడు..బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు పంచుతున్నారు. మరి ఈ బటన్ నొక్కుడు గతంలో ఎవరు నొక్కలేదని అంటున్నారు. గతంలో ఏం చేశారు..ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు అవగాహన ఉంటుంది. ఇక కేవలం బటన్ నొక్కుడు ఒకటే చాలు అని ప్రజలు అనుకోవడం లేదు. మరి జగన్ చెప్పిందే చెప్పడం వల్ల ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news