మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను వంచించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రూ. లక్ష రుణమాఫీ చేయకుండా మునుగోడు నియోజకవర్గంలో 30 వేల మంది రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి . ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పిండని, ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇవ్వలేదు కానీ, గ్రామాలను చీప్ లిక్కర్ అడ్డాగా మార్చిండు అని విమర్శించారు రేవంత్ రెడ్డి. ‘మన మునుగోడు మన కాంగ్రెస్’ నినాదంతో మునుగోడు నియోజకవర్గంలో 100 రోజుల పాటు పర్యటిస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇస్తే నల్గొండ అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ భావించిందని, జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజన భూ సమస్యల పరిష్కారం, కాలుష్యనియంత్రణ వంటి అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలయిందన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఈ విషయంలో బీజేపీకి కేసీఆర్ ఆదర్శ పురుషోత్తముడని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి.
బీజేపీ, టీఆర్ఎస్ రెండూ కలిసి ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ప్రజాప్రతినిధులను అంగట్లో పశువుల్లా కొంటూ విషప్రయోగాలకు ఉప ఎన్నికలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గానికి వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు డిండి ఎత్తిపోతల పథకానికి రూ.5 వేల కోట్లు ప్రకటించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. హుజూరాబాద్ లో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన వ్యక్తి మునుగోడులో ఫిరాయింపుల కమిటీ చైర్మన్ గా ఉన్నడు. స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనుకుంటే బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు రాజీనామా చేయాలని, దీనివల్ల మరో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు రేవంత్ రెడ్డి.