ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హవా ఎక్కువైపోయింది…నేషనల్ స్థాయి నుంచి…లోకల్ స్థాయి వరకు ఏదొక సర్వే వస్తూనే ఉంది…ఇటీవల నేషనల్ సర్వేలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే…ఈ సర్వేల్లో ఏపీలో మళ్ళీ అధికారం వైసీపీదే అని, తెలంగాణలో టీఆర్ఎస్ కాస్త లీడింగ్ లో ఉందని చెప్పాయి. ఇక రాష్ట్ర స్థాయిలో కూడా పలు సర్వేలు వస్తున్నాయి. ఆ మధ్య తెలంగాణలో మస్తాన్, ఆత్మసాక్షి సర్వేలు వచ్చాయి.
ఆ సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీదే లీడింగ్ అని చెప్పారు…కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు టీఆర్ఎస్ బలం తగ్గిందని సర్వేల్లో తేలింది. ఇదే క్రమంలో టీఎస్-119 పేరుతో ఓ సంస్థ సర్వే చేయగా…అందులో ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఈ సర్వేలో ఏ పార్టీకి ఆధిక్యం ఉందో చెప్పారు గాని…ఎవరికి అధికారం దక్కుతుందో చెప్పలేదు. ఆ సంస్థ సర్వే ప్రకారం ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది…ఎన్ని సీట్లలో టఫ్ ఫైట్ ఉందో చెప్పుకొచ్చింది.
ఆ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉందని తెలిసింది…ఆ పార్టీకి 35 స్థానాలు అనుకూలంగా ఉన్నాయట. అంటే టీఆర్ఎస్ పార్టీకి 35 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి…అయితే ఎన్నికల నాటికి వీటిల్లో మార్పు ఉండొచ్చు. అటు కాంగ్రెస్ పార్టీకి 22 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది. బీజేపీకి వచ్చి 18 స్థానాల్లో పాజిటివ్ ఉందని తేలింది. అంటే ఇక్కడ ఫస్ట్ టీఆర్ఎస్, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ బీజేపీ ఉంది. ఇక ఎంఐఎం పార్టీకి 7, ఇతరులు 2 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇతరులు అంటే షర్మిల పార్టీ, బీఎస్పీ, కమ్యూనిస్టులు.
ఇక 35 స్థానాల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ జరిగే ఛాన్స్ ఉందని తెలిసింది. వీటీల్లో ఎక్కువ సీట్లలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే టఫ్ ఫైట్ నడిచే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రస్తుతం లీడ్ లో ఉంది…మరి ఎన్నికల నాటికి పరిస్తితి ఎలా మారుతుందో చూడాలి.