కాంగ్రెస్‌కు కొత్త శక్తి..కేసీఆర్‌కు కమ్యూనిస్టుల హ్యాండ్?

-

ఏదేమైనా గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు కనిపిస్తుంది. కర్నాటక ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు కనిపిస్తుంది. మొన్నటివరకు ఆ పార్టీలో కలహాలు ఎక్కువ ఉన్నాయి. పైగా రాజకీయంగా బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్యే వార్ జరుగుతున్నట్లే కనిపించింది. దీంతో కాంగ్రెస్ వెనుకబడింది. కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్‌కు కొత్త ఊపు తెచ్చింది.

అదే సమయంలో రాష్ట్రానికి వరుసగా కాంగ్రెస్ పెద్దలు రావడం ప్లస్ అవుతుంది. ప్రియాంక గాంధీ సభ పార్టీకి బాగా ప్లస్ అవుతుంది. ఇక కాంగ్రెస్ లోని సీనియర్ నేతలంతా కలిసి పనిచేయడం మరింత బలం చేకూరుతుంది. అదే సమయంలో రాష్ట్రంలోని కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. జూపల్లి, పొంగులేటి లాంటి నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. త్వరలోనే వీరి చేరిక ఖాయంగా కనిపిస్తుంది. ఇక వీరిని బి‌జే‌పిలోకి తీసుకెళ్లాలని ఈటల రాజేందర్ గట్టిగానే ట్రై చేశారు. కానీ వారు మాత్రం బలంగా ఉన్న కాంగ్రెస్ లోకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

ఇలా అన్నీ విధాలుగా కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్సాహం కనిపిస్తుంది. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులపై కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవాలని చూస్తుంది. రాష్ట్రంలో కమ్యూనిస్టులని చేసుకోవాలని చూస్తుంది. అయితే కమ్యూనిస్టులు..మునుగోడు ఉపఎన్నిక సమయంలో బి‌ఆర్‌ఎస్ తో కలిసి ముందుకెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ పార్టీ కమ్యూనిస్టులకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిసింది.

అటు కమ్యూనిస్ట్ ఓటర్లు బి‌ఆర్‌ఎస్ పట్ల కాస్త యాంటీగానే ఉన్నారు. దీంతో కమ్యూనిస్టులు యూ టర్న్ తీసుకుని కాంగ్రెస్ తో జతకట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. అదే గాని జరిగితే కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news