దేశం లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ వైరస్ బారీన సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపార వేత్తలు, క్రీడాకారులు పడ్డారు. ఇక తాజాగా దేశ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీంతో వెంకయ్య నాయుడు ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
“ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు తాను స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ” అంటూ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.కాగా.. ఇప్పటికే దేశంలోని ప్రధానమైన రాజకీయ నాయకులకు కరోనా సోకింది. మాజీ ప్రధాని దేవే గౌడ, కర్ణాటక, ఢీల్లీల సీఎంలు తదితరులు కరోనా బారీన పడ్డారు
ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు.
— Vice President of India (@VPSecretariat) January 23, 2022