బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షోకు ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజెంట్ ఈ షో ఏడో సీజన్ రన్ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ షో ఎపిసోడ్స్ స్ట్రీమవుతున్నాయి. ఇటీవల ఈ షోకు బ్యూటిఫుల్ సమంత, అక్షయ్ కుమార్ తో కలిసి హాజరైంది.
ఈ క్రమంలోనే సమంత పలు విషయాలపైన ఓపెన్ గా మాట్లాడింది. కరణ్ అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానాలిచ్చేసింది. నాగచైతన్యతో డైవోర్స్ తో పాటు తన సినీ లైఫ్ గురించి పలు విషయాలు చెప్పింది. ఇకపోతే నయనతారతో తనకున్న అనుబంధాన్ని గురించి సమంత తెలిపింది.
నయనతారతో తను కలిసి నటించానని, ఫిల్మ్ షూటింగ్ లాస్ట్ రోజున నయనతార ఎంతో ఎమోషనల్ అయిందని చెప్పుకొచ్చింది. అలా సమంత చెప్తున్న క్రమంలో కరణ్ జోహార్..అవునా నాట్ ఇన్ మై లిస్ట్ అంటూ కామెంట్ చేశాడు. దాంతో కరణ్ జోహార్ పైన నయనతార అభిమానులు మండి పడుతున్నారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు గాంచిన నయనతార గురించి కరణ్ జోహార్ కు తెలియదా? అని ప్రశ్నిస్తు్న్నారు.
స్టార్ హీరోలే నయనతార డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటే? కరణ్ జోహార్ కు నయనతార గురించి తెలియదా? కరణ్ కు చిప్ లేదా? లిస్ట్ లో లేకపోవడం ఏంటీ? అని కరణ్ జోహార్ పైన నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కరణ్ మళ్లీ అలా అనొద్దని సూచిస్తున్నారు. అలా నయన్ ఫ్యాన్స్ కరణ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నయనతార ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ విదితమే.