ప్చ్… ఈ ముఖ్యమంత్రికి ఎలా చెబితే అర్థమవుతుందో ఎవరికీ అర్థంకావడంలేదు : చంద్రబాబు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా.. ‘సీఎం సారూ… మా ఊరికి రోడ్డు వేయించండి’ అంటూ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో చిన్న పిల్లలు నీటిలో దిగి చేతులెత్తి నమస్కరిస్తున్న ఓ పత్రికా కథనంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్చ్… ఈ ముఖ్యమంత్రికి ఎలా చెబితే అర్థమవుతుందో ఎవరికీ అర్థంకావడంలేదని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో చివరికి చిన్నపిల్లలు సైతం వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు చంద్రబాబు. నర్సీపట్నంలో వరాహ నదిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించామని చంద్రబాబు వెల్లడించారు.

Ex-CM Naidu moves Andhra HC after Jagan govt reduces his security cover |  The News Minute

వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న ఆ కాస్త అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేయలేదని ఆరోపించారు చంద్రబాబు. దీంతో, మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారని వివరించారు చంద్రబాబు. ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏమీ కట్టలేరని ప్రతి ఒక్కరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పూర్తిచేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు చంద్రబాబు. “ప్రజా సమస్యలపై ఇగో వద్దు జగన్ రెడ్డీ… ఇష్యూని సాల్వ్ చేయండి” అంటూ హితవు పలికారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news