బీజేపీతో నో యూజ్..పవన్ బిగ్ డెసిషన్.?

-

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్..మరో మూడు రోజుల్లో పొత్తుపై తేల్చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బి‌జే‌పి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల తర్వాత బి‌జే‌పితో కలిసి పవన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. బి‌జే‌పి సైతం ఏపీలో బలపడేందుకు పవన్ అడ్డం పెట్టుకుని వర్కౌట్ చేయాలని చూస్తుంది. కానీ వీరి పొత్తు ఏ మాత్రం సక్సెస్ కాలేదు.

అసలు పేరుకు పొత్తు పెట్టుకున్నారు గాని..ఎప్పుడు పెద్దగా కలిసి మాత్రం పనిచేయలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నారు. ఇక ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో పొత్తు అనేది కీలకమైంది. అది కూడా టి‌డి‌పి-జనసేన కలవడం అనేది. అయితే బి‌జే‌పిని కూడా కలుపుకుని పవన్..టి‌డి‌పితో కలవాలని చూస్తున్నారు. అలా కలిస్తేనే కొన్ని సీట్లు వస్తాయి..టి‌డి‌పితో కలిసి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో పొత్తు పెట్టుకోమని చెప్పేస్తుంది. అవసరమైతే జనసేనని కూడా వదిలేస్తామన్నట్లే చెబుతుంది.

ఇటు టి‌డి‌పి సైతం బి‌జే‌పితో పొత్తుకు ఆసక్తిగా లేదు. ఎందుకంటే ఏపీలో ఆ పార్టీకి బలం లేదు..ఒకశాతం ఓట్లు లేవు. ఇప్పుడు ఇదే అంశాన్ని పవన్ చూస్తున్నారు. బి‌జే‌పితో కలిసి ముందుకలితే ఒక్క ఓటు కూడా కలిసిరాదు. ఎలాగో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండదు..ఎక్కువ సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉండదు. అదే టి‌డి‌పితో కలిస్తే కొన్ని సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది..అలాగే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ బిగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అప్పుడే బి‌జే‌పికి గుడ్ బై చెప్పేసే ఛాన్స్ ఉంది. టి‌డి‌పితో పొత్తుపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. చూడాలి మరి పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో.

Read more RELATED
Recommended to you

Latest news