కమలానికి ఖమ్మం టెన్షన్..అసలు ఆట ఇప్పుడే మొదలు.!

-

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది.. ప్రధాన పార్టీలు ఎన్నికలే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అప్పుడే ప్రచార సభలు కూడా మొదలుపెట్టేశాయి. ఇప్పటికే కే‌సి‌ఆర్..భారీ సభలు పెడుతూ ప్రజల్లో ఉంటున్నారు. అటు బి‌ఆర్‌ఎస్ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు అదే పనిలో ఉన్నారు. అయితే కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బి‌జే‌పి నేతలు కాస్త స్లో అయ్యారు.

కర్నాటకలో ఓటమి ప్రభావం తెలంగాణలోని బి‌జే‌పిపై పడింది. పైగా పార్టీలో అంతర్గత విభేదాలు  తలనొప్పిగా మారాయి. దీని వల్ల బి‌జే‌పి రేసులో కాస్త వెనుకబడింది. అయితే ఇప్పుడు మళ్ళీ రేసులోకి రావడానికి బి‌జేపి యాక్టివ్ అవుతుంది. గతంలో కేంద్రం పెద్దలు వచ్చి..భారీ సభల్లో పాల్గొనడం వల్ల బి‌జే‌పికి మైలేజ్ పెరిగింది. ఇప్పుడు అదే స్థాయిలో బి‌జే‌పిని బలోపేతం చేయడానికి బి‌జే‌పి పెద్దలని రంగంలోకి దించుతున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 15న ఖమ్మంలో అమిత్ షా సభ జరగనుంది. ఈ సభని సక్సెస్ చేయడానికి కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఖమ్మంలో సభ అంటే బి‌జే‌పి నేతలకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ బి‌జే‌పికి పెద్ద బలం లేదు..బలమైన కేడర్ గాని, నేతలు గాని లేరు. దీంతో బండి సంజయ్ రంగంలోకి దిగి అన్నీ తానై చూసుకుంటూ ఖమ్మం సభని విజయవంతం చేయాలని చూస్తున్నారు. ఎన్నికల రణరంగంలో దూకడానికి బి‌జే‌పికి…ఖమ్మం సభ ప్రధానం కానుంది.

ఈ సభని సక్సెస్ చేస్తే..ఇంకా తెలంగాణలో బి‌జే‌పి దూకుడు కొనసాగుతుంది. అయితే పట్టు లేని ఖమ్మంలో సభ సక్సెస్ చేయడం బి‌జే‌పికి పెద్ద టాస్క్. అసలు సభ ఎలా నడుస్తుందా? అనే టెన్షన్ బి‌జే‌పి నేతల్లో ఉంది. చూడాలి ఈ సభ గాని సక్సెస్ అయితే..ఇంకా తెలంగాణలో అసలు ఆట మొదలుకానుంది. బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news