Ram Charan: RC15కు రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్..అన్ని కోట్లా..?

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..RRR ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పైన ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాగా, ఇందులో నటిస్తున్నందకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంత విషయమై సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ పంజాబ్ లో జరుగుతున్నది. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన స్టోరి ప్రకారం.. ఈ మూవీ పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. విలక్షణ నటుడు, డైరెక్టర్ ఎస్.జే.సూర్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, అంజలి, సునీల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఫిల్మ్..నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇకపోతే ఇందులో నటిస్తున్నందుకు రామ్ చరణ్ కు రూ.150 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై మేకర్స్ నుంచి ఎటువంటి సమాచారం అయితే రాలేదు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా పిక్చర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు వినికిడి.

Read more RELATED
Recommended to you

Latest news