ఎడిట్ నోట్: డేంజర్ జోన్‌లో ‘వైసీపీ’.!

-

ఏపీలో అధికార వైసీపీ డేంజర్ జోన్ లో ఉందా? అంటే తాజా పరిస్తితులని చూస్తుంటే కాస్త అవుననే డౌట్ వస్తుంది. ఇటీవల ఊహించని రీతిలో వైసీపీలో రాజకీయం మారుతుంది. పైకి 175కి 175 నియోజకవర్గాల్లో గెలిచేస్తామని, మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని, టి‌డి‌పి-జనసేన కలిసొచ్చిన తమని ఏమి చేయలేరని వైసీపీ నేతలు, జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అసలు టీడీపీ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికలే ఆ పార్టీకి చివరి ఎన్నికలు అని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

అయితే వైసీపీ నేతల కాన్ఫిడెన్స్ లో తప్పు లేదు గాని…పార్టీలో జరిగే పరిస్తితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో కనిపిస్తుంది. ఈ పోరు చాలా వరకు వైసీపీకి మైనస్. అటు పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది..అసలు ఎమ్మెల్యేలని సొంత పార్టీ వాళ్లే ఓడించడానికి కంకణం కట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇక పలువురు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి.

ఇక కొందరు ఎమ్మెల్యేలు ఏమైనా జగన్ ఇమేజ్ పైనే బండి లాగాలని చూస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో ఉన్న జగన్ ఇమేజ్..ఇప్పుడు ఉన్న ఇమేజ్‌కు చాలా తేడా ఉంది. ఇలా ఓ వైపు వైసీపీకి ఇబ్బందికర పరిస్తితులు నడుస్తుండగానే..మరోవైపు ఆనం రామ్ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

వీరు వైసీపీని వీడటం దాదాపు ఖాయమైంది..టీడీపీలోకి వెళ్తారని తెలుస్తోంది. వీరితో పాటు పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగానే వివేకా హత్య కేసులో సి‌బి‌ఐ దూకుడు మీద ఉంది..ఇప్పటికే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో పలు సంచలన విషయాలు బయటపడినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ అంశాలని టీడీపీ మీడియా పెద్ద ఎత్తున హైలైట్ చేస్తుంది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికే జగన్..తాజాగా విశాఖకు రాజధాని షిఫ్ట్ చేస్తున్నామని ప్రకటన చేశారని, కానీ దీని వల్ల ఉపయోగం లేదని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ డేంజర్ జోన్ లో ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news