దీపావళి నాడు ఎట్టిపరిస్థితిలో ఈ దీపాలు పెట్టోద్దు!

దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం. అయితే దీనికి ఆధునిక పేరుతో రకరకాలు వ్యవహరిస్తున్నారు. ప్రకృతి విరుద్ధంగా కాలుష్య కారకమైన దీపాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దీపావళి రోజున కొవ్వొత్తులను వాడకూడదని పండితులు అంటున్నారు. ఇవి నెగెటివ్‌ ఎనర్జీని అంటే ప్రతికూల శక్తిని..

దుష్టశక్తులను ఆకర్షిస్తుందని పండితులు అంటున్నారు. మార్కెట్లో దీపావళికి ప్రత్యేకంగా అమ్మే మైనపు వత్తుల్ని దీపాలుగా వెలిగించకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దీపావళి రోజున ఎర్రటి ప్రమిదలు.. అదీ మట్టి ప్రమిదలను వాడటం ద్వారా దైవశక్తులను ఆకర్షించినవారవుతారని వారు సూచిస్తున్నారు. దీపం శుభాలను సూచిస్తే.. కొవ్వొత్తి శోకాన్ని సూచిస్తుందని వారు గుర్తు చేస్తున్నారు.

దీపారాధన చేసే సమయంలో “దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర!
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!! అనే శ్లోకాన్ని చదువుకోవాలి. దీపాన్ని వెలిగించి ఎర్రని అక్షింతలు లేదా ఎర్రని పూలు దీపం ముందర పెడితే శుభప్రదం. అలాగే నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం ద్వారా వాతావరణంలో ఉన్న క్రిములను నశింపజేస్తాయి. ఈ దీపపు కాంతి కంటికి ఎంతో మేలు చేస్తాయి.

కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. అందుకే దీపావళి రోజున నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలని.. నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. దీపావళి చలికాలంలో వస్తుంది.. సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు. చల్లని వాతావరణంలో అనేక క్రిములు వ్యాపిస్తాయని, తద్వారా శ్వాసకు సంబంధించిన రోగాలు వస్తాయి. ప్రమిదలో నూనె అయిపోయాక వత్తి కూడా కాలిపోతుందని..

ఆ వత్తులు కాలడం ద్వారా వచ్చే వాసనను పీల్చడం ద్వారా గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. అందులో నువ్వులనూనె పూర్వ జన్మల పాపపుణ్యాలను సూచిస్తుంది. అందులో వేసే వత్తి అహంకారానికి గుర్తు. దీపం జ్ఞానానికి సంకేతం. జ్ఞానమనే దీపం మన పూర్వజన్మవాసనలను, అహంకారాన్ని, చెడు అలవాట్లను కాల్చేసి, పరమాత్ముడిని చేరుస్తుంది దీపం వెనుకున్న పరమార్థమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మార్కెట్లో దొరుకుతున్న చైనా దీపాలను, క్యాండిల్స్‌ను ఉపయోగించకుండా స్వదేశంలో తయారైన మట్టిప్రమిదలను వాడండి, ఆరోగ్యలక్ష్మీతోపాటు ఐశ్వర్య లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి.