చర్మ సమస్యలను దూరం చేసే వంటగదిలోని వస్తువులు..

మీ ముఖం మీ గుర్తింపు. ఎవ్వరికైనా సరే. అందుకే ముఖ అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొన్ని సార్లు ఫెయిలై ఉంటారు. మారుతున్న జీవన శైలి, మార్కెట్లో వచ్చే అనవసరమైన క్రీములు దుష్పలితాలను కలిగించవచ్చు. అందువల్ల మొటిమలు, మచ్చలు, ముడుతలు వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. మరి వీటిని దూరం చేసుకుని ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మీ వంటింట్లో ఉన్న సహజ ఉత్పత్తులు చాలా బాగా పనిచేస్తాయి.చర్మ సమస్యలను దూరం చేసే వంటగదిలోని వస్తువులు..

పెరుగు

ముఖంపై మచ్చలున్న వారు వాటిని పోగొట్టుకోవడానికి పెరుగును ఉపయోగించవచ్చు. అలాగే చర్మ రంగును మెరుగుపరుస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని నయం చేస్తుంది. ఫేస్ మాస్క్ ఉపయోగించే వారు పెరుగుని అందులో భాగం చేసుకోండి. తళతళలాగే ముఖం మీ సొంతం అవుతుంది.

ఓట్స్

ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు ఓట్స్ తో కూడిన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. మొటిమలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలను దూరం చేయడంలో ఓట్స్ బాగా పనిచేస్తాయి.

గ్రీన్ టీ

చర్మ వయసును తగ్గించి యవ్వనంగా కనిపించాలనుకునే వారు గ్రీన్ టీ వాడవచ్చు. ముదురు మచ్చలు, గీతలు, ముడుతలను తగ్గించడంలో గ్రీన్ టీ సాయపడుతుంది. గ్రీన్ టీ తయారు చేసుకుని చల్లబర్చుకుని పత్తి సాయంతో ముఖానికి వర్తించండి. మెరుగైన ఫలితాలు వస్తాయి.

తేనె

చర్మాన్ని తేమగా ఉంచడంలో తేనె పాత్ర కీలకం. స్వఛ్ఛమైన తేనెను ముఖానికి డైరెక్టుగా వర్తింవచ్చు. చర్మ పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో తేనె సాయపడుతుంది.

దాల్చినచెక్క

దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను దూరం చేస్తాయి. మొటిమలకు కారణమయ్యే బాక్టీరియాను చంపేస్తాయి. కొద్దిగా దాల్చిన చెక్క తీసుకుని, దానికి తేనె కలుపుకుని ముఖానికి వర్తింపజేసుకుంటే చాలు.