ఏదేమైనా ఈ మధ్య చంద్రబాబుకు అతి విశ్వాసం పెరిగిపోతుందన్నట్లే కనిపిస్తోంది..అసలు జగన్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇంకా జగన్ని ప్రజలు మళ్ళీ గెలిపించరని, వచ్చేది తమ ప్రభుత్వమే అని చెప్పి చంద్రబాబు గట్టిగా చెబుతున్నారు. రాజకీయాల్లో విశ్వాసం ఉండొచ్చు గాని…అతి విశ్వాసం మాత్రం ఉండకూడదు..కానీ బాబుకు కాస్త అతి విశ్వాసమే ఎక్కువ ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
పైగా ముందస్తు ఎన్నికలంటూ తెగ ఊదరగొట్టేస్తున్నారు….అసలు గత కొంతకాలం నుంచి బాబు ముందస్తు ఎన్నికలపై తెగ ప్రచారం చేస్తున్నారు. అదిగో జగన్ ఇంకా ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోతారని ప్రచారం చేస్తున్నారు. తాజాగా కూడా బాబు అదే చెప్పుకుంటూ వచ్చారు.. జగన్ రేపో ఎల్లుండో ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారని, ఈ ప్రభుత్వం రోజురోజుకూ పతనావస్థకు చేరుతోందని, రోజులు గడుస్తున్న కొద్దీ వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అయితే ఈ మాట బాబు ఎప్పటినుంచో చెబుతున్నారు…జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, ఇక ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళిన తాము సిద్ధంగా ఉన్నామని, గెలిచేది తామే అని చెప్పి బాబు కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. అయితే బాబు చెబుతున్నట్లు జగన్ ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే ఉండే అవకాశం లేకపోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ సైతం ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది.
ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే ప్రచారం ఎక్కువైంది..ఈ క్రమంలోనే జగన్ ముందస్తుకు వెళ్తారని విశ్లేషకులు చెబుతున్నారు. కాకపోతే ఇది కన్ఫామ్గా చెప్పడానికి లేదు..ఎన్నికలకు వెళ్లొచ్చు..వెళ్లకపోవచ్చు. కానీ బాబు మాత్రం బాగా భ్రమల్లో ఉంటున్నారు..ముందస్తుకు వెళ్ళడం, ఈ సారి ఎన్నికల్లో తామే గెలిచేస్తామనే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. అయితే పరిస్తితులు మాత్రం బాబుకు అంతగా అనుకూలంగా ఏమి లేవు…అలా అని జగన్ బలం ఎక్కువగా ఉందని చెప్పడానికి లేదు. కాబట్టి ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో తేలిపోతుంది.