వచ్చేది మేమే… రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం : లోకేష్‌

-

ఈరోజు తో టీడీపీ నేత నారా లోకేష్ చేపడుతున్న యువగళం అనే పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. ఇప్పుడు తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మద్దయ్యప్పగారిపల్లి న్యూ మల్చరీ నర్సరీ వద్ద బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొనడం జరిగింది. అట్రాసిటీ, బీసీలపై దాడులు, అట్టెంప్ట్ మర్డర్ కేసులు 36 వేల మందిపై పెట్టారని… సిద్దాంతాన్ని నమ్ముకున్నామని, ప్రజల తరపున పోరాడుతామని అన్నారు లోకేష్. వచ్చేది టీడీపీ పాలన… తప్పుడు కేసులు ఎత్తివేస్తామని పేర్కొన్నారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరాచకం సృష్టించారు… వచ్చేది మేమే.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము’’ అని అన్నారు. వడ్డెర్లను ఆదుకుంది చంద్రబాబు, ఎన్టీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు లోకేష్. పాపాల పెద్దిరెడ్డి గనులు, క్వారీలు కొళ్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారాయన. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్‌లకు జీతాలు లేవని.. కుర్చీలు కూడా లేవన్నారు. జనాభా దామాషాన బీసీలను ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

Nara Lokesh to visit Kadapa and Tirumala, here is the schedule

కాగా, రెండు రోజుల పాటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా లోకేష్ పాదయాత్ర కు బ్రేక్ పాడడం జరిగింది. ఎన్నికల కోడ్ కారణంగా జిల్లాలో ఉండరాదంటూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను గౌరవిస్తూ లోకేష్ పాదయాత్ర నిలిపివేసి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. మళ్ళి ఈరోజు ఉదయం యువనేత పాదయాత్రను ప్రారంభించారు లోకేష్. ఇప్పటి వరకు 529.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు లోకేష్. 42వరోజు పాదయాత్రలో భాగంగా ఈరోజు ఉదయం కంటేవారిపల్లి నుంచి యువనేత పాదయాత్రను ప్రారంభించారు. రాత్రి నాయనిబావి పంచాయితీ గుట్టపాలెం విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news