బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు నాలుగో రోజు టీమిండియా అదే స్పీడ్ కొనసాగించింది. విరాట్ కోహ్లీ (186) సెంచరీ, అక్షర్ పటేల్ (79) హాఫ్ సెంచరీ చెయ్యడంతో స్కోర్ ఆకాశాన్ని అంటింది. 571 పరుగులకు ఆలౌట్ అయింది. 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు 88 పరుగులు వెనబడి ఉంది. నైట్‌వాచ్‌మన్ మాథ్యూ కునేమాన్ (0), ట్రావిస్ హెడ్ (3) క్రీజులో ఉన్నారు. ఐదో రోజు ఆట కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలవాలంటే భారత స్పిన్నర్లు తమ సత్తా ప్రదర్శించి ఆస్ట్రేలియాను నూటయాభై లోపే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఓవర్‌నైట్ స్కోర్ 289జ3 తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ 309 రన్స్ వద్ద జడేజా వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ తీసేందుకు ఆసీస్ బౌలర్లు అపసోపాలు పడ్డారు. విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ ఐదో వికెట్‌కు 84 రన్స్ చేశారు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో తన క్లాస్ ఆటతో ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అక్షర్ పటేల్‌తో 162 పరుగులు జోడించాడు. వీళ్లిద్దరూ భారత్‌కు లీడ్ వచ్చేంత వరకు నిదానంగా ఆడారు.
ఆ తర్వాత దూకుడు పెంచారు. మూడు, నాలుగు, ఐదో వికెట్‌కు విలువైన పరుగులు జోడించిన కోహ్లీ 241 బంతుల్లో సెంచరీ కొట్టాడు. దాంతో, అంతర్జాతీయంగా 75వ శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అతను 150 రన్స్ దాటాక,. డబుల్ సెంచరీ చేస్తాడని అనుకున్నారంతా. కానీ, ఆసీస్ బౌలర్లు పుంజుకొని వికెట్లు తీశారు. మర్ఫీ ఓవర్‌లో కోహ్లీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. కోహ్లీ, అక్షర్ పటేల్ క్రీజులో ఉండడంతో.. భారత్ 150 లీడ్ సాధించేలా అనిపించింది. కానీ, ఆఖరి సెషన్‌లో వెంట వెంటనే మూడు వికెట్లు పడ్డాయి. అక్షర్ పటేల్ (79) ఔట్ కావడంతో టీమిండియా 556 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోవడం జరిగింది. మిచెల్ స్టార్క్ ఓవర్‌లో అక్షర్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, అసీస్‌కు బ్రేక్ లభించింది. కోహ్లీతో జత కలిసిన అక్షర్ మరోసారి చెలరేగిపోయాడు. వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కు 162 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (7) లియాన్ ఓవర్‌లో షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు. రెండో రన్ కోసం ప్రయత్నించి ఉమేష్ యాదవ్ (0) రనౌట్ అయ్యాడు. పీటర్ హ్యాండ్స్‌కాంబ్ త్రో చేయడంతో మర్ఫీ వికెట్లను గిరాటేశాడు. దాంతో, 569 వద్ద ఎనిమిదో వికెట్ పోవడం జరిగింది.