ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్నటి చేవెళ్ల బహిరంగ సభ పైన, బీజేపీ పైన సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం లో మంత్రి హరీష్ ప్రసంగిస్తూ, కల్లూరు సభకు వచ్చిన వాళ్లలో సగం మంది కూడా నిన్నటి అమిత్ షా సభలో లేరని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదని, కనీసం డిపాజిట్లు కూడా రావన్నారు. బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వాలని పేర్కొన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
ఇంకా ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి లో 50పడకల ఆసుపత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు ఈరోజు.. పథకం అందని ఇల్లు లేదు.. రాజకీయాలకు అతీతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణవి అని హరీష్ రావు తెలిపారు. అంతేకాకుండా.. బీజేపీ ఎలా తయారయ్యింది అంటే.. ఢిల్లీలో అవార్డులు ఇస్తూ గల్లీ కొచ్చి తిట్టిపోతున్నారని విమర్శించారు. మా రైతు బంధుని కాపీ కొట్టి పీఎం కిసాన్ అంటివి.. మిషన్ కాకతీయ ని అమృత్ సరోవర్ పేరుతొ దేశం అంతటా చేస్తున్నావ్ అని ఆయన మండిపడ్డారు. ‘ఈరోజు మన ప్రభుత్వం దేశం గర్వించే విధంగా ముందుకుసాగుతుంది.. ఈ ఖమ్మం జిల్లా 10కి 10 నియోజకవర్గాలు గెలిచి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలి అని అన్నారు మంత్రి హరీష్.