సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే వస్తుంది : పవన్ కల్యాణ్

-

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం కాస్త చర్చనీయాంశంగ మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద స్పందించారు పవన్ కళ్యాణ్. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాయి అని అన్నారు పవన్ కళ్యాణ్. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని వెల్లడించారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan opines on Graduate MLC Election results

అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని భావిస్తున్నానన్న పవన్ సందిగ్ధంలో ఉన్నవారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారని తెలిపారు. నాలుగేళ్ల వైసిపి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అధోగతి పాలు చేస్తున్న తీరును పట్టభద్రులు తమ ఓటు ద్వారా చూపించారని, ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు ఆయన. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇటువంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందన్న సంగతి, ఈ ఎన్నికల ద్వారా ముందుగానే స్పష్టమైందని వెల్లడించారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, విజేతలకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నానని వ్యక్తపరిచారు పవన్ కళ్యాణ్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news