ఆల్ పార్టీ బాబు.. పొత్తు ఎవరితో?

టీడీపీ అధినేత చంద్రబాబు…తన రాజకీయ జీవితంలో ఒంటరిగా మాత్రం ప్రత్యర్ధులని ఎదుర్కోవడం కష్టమనే చెప్పాలి. ఇప్పటివరకు ఏదో రకంగా ఆయన ఇతర పార్టీలని కలుపుకునే ఎన్నికల బరిలో దిగేవారు. కానీ గత ఎన్నికల్లోనే అనుకుంటా ఒంటరిగా పోటీ చేశారు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలిసిందే. టీడీపీ దారుణంగా ఓడిపోయింది. అందుకే అనుకుంటా నెక్స్ట్ ఎన్నికల్లో బాబు సింగిల్‌గా మాత్రం పోటీలో దిగేలా లేరు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

chandrababu naidu

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనల పొత్తు ఖాయమని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో తాజాగా తిరుపతిలో అమరావతి రైతుల సభలో జరిగిన రాజకీయ పరిణామాలని చూస్తుంటే కాస్త వింతగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పేరుకు అమరావతి రైతుల సభ అయినా…అది చంద్రబాబు సెంటర్‌గానే నడిచినట్లు కనబడుతోంది. అందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. ఇక ఈ సభకు టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరయ్యారు.

అయితే ఇక్కడ అన్నీ పార్టీలు టీడీపీకి అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్నీ పార్టీల టార్గెట్ ఒక్కటే..జగన్‌ని ఓడించడం. అందుకే జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అలాగే మధ్య మధ్యలో కొందరు నేతలు బాబుపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. దీని బట్టి చూస్తే బాబు అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తారో అర్ధం కాకుండా ఉంది.

ఇప్పుడున్న పరిస్తితుల్లో అయితే జనసేన అవసరం ఖచ్చితంగా ఉంది…ఇక జనసేనతో పాటు బీజేపీని కలుపుకుంటారా లేక కమ్యూనిస్టులని కలుపుకుంటారా అనేది తెలియడం లేదు. అటు కాంగ్రెస్ కూడా బాబు పట్ల పాజిటివ్ గానే ఉంది. వారు కూడా టీడీపీతో కలిస్తే నాలుగు సీట్లు వస్తాయనే ఆశతో ఉన్నారు. అలాంటప్పుడు బాబు..అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తారో క్లారిటీ లేకుండా ఉంది.