జగన్ ‘ఇదేం కర్మ’.. బాబు పకడ్బందీ వ్యూహాలు..!

ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని చెప్పి చంద్రబాబు ఎప్పటికప్పుడు తన వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ మూడున్నర ఎల్లల్లో పలు వ్యూహాలతో ముందుకొచ్చారు గాని..జగన్ బలం ముందు బాబు తేలిపోతున్నారు..కాకపోతే కొన్ని అంశాల్లో బాబు ముందు ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతుంది..మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో బలమైన జగన్‌ని నిలువరించడానికి రకరకాల ఎత్తుగడలతో బాబు వస్తున్నారు.

chandrababu naidu ys jagan

ఇప్పటికే అనేక దశల్లో పోరాటాలు చేశారు..ఇటు రాజకీయ పరమైన పొత్తుల ఎత్తులు కూడా చూస్తున్నారు. ఇక తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో ప్రజలకు మంచి స్పందన వచ్చింది..ఇక ఇదే ఊపుని కొనసాగించాలని బాబు భావిస్తున్నారు. ఇంకా జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ఉదృతం చేయాలని చూస్తున్నారు. అవసరమైతే పొత్తులు లేకుండా సింగిల్ గానే సత్తా చాటేలా ముందుకెళ్లే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ క్రమంలోనే శనివారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు..ఈ సమావేశంలో పొత్తులపై క్లారిటీ దాదాపుగా ఇచ్చేలా ఉన్నారు..ఎక్కువ శాతం సింగిల్ గానే పోతే చేసి సత్తా చాటేలా ఉండాలని నాయకులని సిద్ధం చేయనున్నారు. అలాగే ఇంకా ప్రజా సమస్యలపై గళం విప్పడం, నేతలు జనాల్లోనే ఉండేలా చేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు కార్యక్రమం చేస్తుంటే..దానికి పోటీగా టీడీపీ నేతలు నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్పూర్తి-చంద్రన్న భరోసా, సేవ్ ఉత్తరాంధ్ర, మాటా-మంతి కార్యక్రమాలు చేస్తున్నారు..ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త, అరాచక విధానాలపై పోరాటం అంటూ..’ఇదేం కర్మ’ అనే కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

ఇందులో భాగంగా గుంతల రోడ్లు, పెరిగిన కరెంట్, ఇసుక ధరలు, నిరుద్యోగం, గిట్టుబాటు ధరలు, రైతుల ఆత్మహత్యలు, నిత్యావసర ధరలు పెరుగుదల, కల్తీ మద్యం, మత్తు పదార్థాలు, ప్రశ్నించిన వారిపై కేసులు..ఇలా రకరకాల అంశాలపై ఇదేం కర్మ అనే కార్యక్రమం చేయనున్నారు. ఇక టీడీపీ హయాంలో పరిస్తితి ఎలా ఉంది..ఇప్పుడు వైసీపీ పాలనలో ఎలా ఉందనే వ్యత్యాసలని ప్రజలకు వివరించనున్నారు. మొత్తానికి జగన్‌ని నిలువరించడానికి బాబు పకడ్బందీ వ్యూహాలతో వస్తున్నారు.