ఈటల రాజేందర్ భయమే నిజమవుతుందా?

టీఆర్ఎస్‌లో ఏళ్ల తరబడి పనిచేసిన ఈటల రాజేందర్…అనుహ్యా పరిణామాల మధ్య ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. అయితే టి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల….మొదట్లో ఏ పార్టీలో చేరే విషయంపై అనేక రకాలుగా చర్చలు వచ్చాయి. ఈటల…అటు కాంగ్రెస్, ఇటు బి‌జే‌పి నేతలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఈటలని బి‌జే‌పిలోకి తీసుకోవాలని చెప్పి కిషన్ రెడ్డి, స్పెషల్ ఫ్లైట్ వేయించుకుని మరీ ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈటల, బి‌జే‌పిలో చేరడానికి ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో మళ్ళీ కే‌సి‌ఆర్‌తో జట్టు కడతారా? అని కేంద్ర పెద్దలని ఈటలని ప్రశ్నించినట్లు తెలిసింది.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

కే‌సి‌ఆర్‌తో జట్టు కడితే మళ్ళీ తనకే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈటల ముందు జాగ్రత్త పడ్డారు. కానీ తాము కే‌సి‌ఆర్‌పై పోరాటం చేస్తున్నామని కేంద్ర పెద్దల నుంచి సమాధానం రావడంతో ఈటల, బి‌జే‌పిలో చేరిపోయారు. అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజూరాబాద్ బరిలో నిలబడ్డారు. అయితే తెలంగాణలో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగానే ఫైట్ జరుగుతుంది. అటు ఈటల సైతం హుజూరాబాద్‌లో గెలిచి టి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు.

కానీ ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీలో జరుగుతున్న రాజకీయాలు ఈటలని కలవరపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీకి వెళ్ళిన సి‌ఎం కే‌సి‌ఆర్ వరుసపెట్టి ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. అసలు కే‌సి‌ఆర్‌కు వరుసపెట్టి అపాయింట్‌మెంట్‌లు కూడా ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో మోదీని కే‌సి‌ఆర్ కలిసిన కొన్ని గంటల్లోనే హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ బెంగాల్‌తో పాటు ఒడిశాలో ఉపఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే త్వరగా ఎన్నిక నిర్వహించాలని ఈటల చూస్తున్నారు. టి‌ఆర్‌ఎస్ మాత్రం ఎన్నిక వాయిదా పడాలని కోరుకుంటుంది. అసలు కేంద్రం చెబితే, హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ నిమిషాల్లో వస్తుంది. అయినా సరే అలాంటి పరిణామం జరగలేదు. దీంతో ఈటల మొదట అనుకున్న విధంగానే కే‌సి‌ఆర్-బి‌జే‌పిలు కలుస్తున్నాయా అనే విధంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఈటల భయమే నిజమవుతుందేమో చూడాలి.