ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాలని సొంతం చేసుకోవాలని కేసిఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసిఆర్..మరోసారి కూడా అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇక పార్టీ తో పాటు చాలామంది నేతలు సైతం హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి సైతం హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
గతంలో సూర్యపేటలో టిడిపి, కాంగ్రెస్ హవా నడిచేది. మూడుసార్లు ఇక్కడ టిడిపి గెలిచింది..5 సార్లు వరకు కాంగ్రెస్ గెలిచింది. ఇక 2009 వరకు సూర్యపేటలో కాంగ్రెస్ హవానే నడిచింది. కానీ రాష్ట్ర విభజన జరగడం..బిఆర్‌ఎస్ హవా పెరగడంతో సీన్ మారింది. 2014లో బిఆర్‌ఎస్ నుంచి జగదీశ్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే అప్పుడు స్వల్ప మెజారిటీ తేడాతోనే జగదీశ్ గెలిచి బయటపడ్డారు. ఇక 2018 ఎన్నికల్లో కూడా జగదీశ్ గెలిచారు. దాదాపు 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఇలా రెండు సార్లు స్వల్ప మెజారిటీలతోనే జగదీశ్ గెలిచారు. అలాగే రెండుసార్లు మంత్రి పదవి ఛాన్స్ కొట్టేశారు. ఇక మంత్రిగా బాగానే పనిచేస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అయితే రెండుసార్లు గెలవడంతో సహజంగానే వ్యతిరేకత ఉంది. అటు కాంగ్రెస్ నుంచి దామోదర్ రెడ్డి బలంగా ఉన్నారు. అయితే ఇక్కడ బిజేపికి బలం ఉంది. గత ఎన్నికల్లో 40 వేల ఓట్లు వరకు పడ్డాయి.
దీంతో సూర్యపేటలో త్రిముఖ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పోరుతో జగదీశ్ రెడ్డికి కాస్త రిస్క్ ఉంది..కానీ అదే సమయంలో కాంగ్రెస్, బిజేపిల మధ్య ఓట్లు చీలితే జగదీశ్ రెడ్డికే లాభం. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో జగదీశ్ రెడ్డికే ఎడ్జ్ ఉంది. ఆయన హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉంది. కానీ ఏమైనా పరిస్తితి మారితే..జగదీశ్‌కు చెక్ పడిపోతుంది.