వంశీ బాటలోనే కేశినేని… బెజవాడలో బాబు సర్దుకోవచ్చా?

-

ఏదేమైనా తెలుగుదేశం పార్టీ టైమ్ అసలు బాగున్నట్లు లేదు. ఆ పార్టీకి వరుసపెట్టి అన్నీ షాకులే తగులుతున్నాయి. అసలు గత ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఓటమికి గురయ్యి, ప్రతిపక్షానికి పరిమితమైంది. అక్కడ నుంచి పార్టీ ఎలాగోలా పికప్ అవ్వాలనుకునే సమయంలో ఏదొక ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఓ వైపు చంద్రబాబు లేస్తే మనిషిని కాదు అన్నట్లుగా…జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.

vallabaneni vamshi kesineni nani

ఇలా పోరాటం చేస్తుంటే… మరో వైపు నాయకులు ఏమో వరుసపెట్టి చంద్రబాబుకు షాకులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు బాబుకు షాక్ ఇచ్చి వైసీపీలోకి జంప్ చేశారు. ఈ జంపింగ్‌లకు తోడు… వరుసపెట్టి స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ ఘోరంగా ఓడిపోతూ వస్తుంది. ఈ క్రమంలోనే బెజవాడ టి‌డి‌పిలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టి‌డి‌పి ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆయన కుమార్తె శ్వేత కూడా దూరంగానే ఉంటుందని, ఇంకా తాము పోటీ చేయమని, విజయవాడ ఎంపీగా మరో అభ్యర్ధిని చూసుకోవాలని కేశినేని చెప్పేశారు.

కాకపోతే పార్టీ వీడనని, తర్వాత రాజకీయాలకు మాత్రం దూరం అవుతానని చెప్పారు. మరి కేశినేని రాజకీయం ఎలా ఉంటుందనేది అర్ధం కావడం లేదు. బుద్దా వెంకన్న, బోండా ఉమా వైఖరిలకు నిరసనగానే కేశినేని ఈ నిర్ణయం తీసుకున్నారా? అని బెజవాడ రాజకీయాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే వల్లభనేని వంశీ ఇలాగే మొదట్లో రాజకీయాలకు దూరం అవుతానని మాట్లాడారు. చంద్రబాబుతో కూడా చెప్పారు. కానీ సడన్‌గా ప్లేట్ ఫిరాయించారు. జగన్‌కు జై కొట్టారు. ఇప్పుడు అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

మరి కేశినేని కూడా రాజకీయాలకు దూరమవుతానని చెప్పి, బాబుకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారా? అనే డౌట్ కూడా వస్తుంది. మరి కేశినేని ఎలాంటి రాజకీయం చేస్తారో చూడాలి. మొత్తానికి బెజవాడలో బాబు దుకాణం సర్దేసుకునే పరిస్తితి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news