వెస్ట్‌లో లీడ్ మారింది.. ఎవరి బలమెంత?

-

ఏపీ రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం ముదురుతుంది. అలాగే నియోజకవర్గాల్లో పార్టీల బలబలాల్లో కూడా ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు బలంగా ఉన్న వైసీపీ…నిదానంగా వీక్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అలా అని టీడీపీ పూర్తి స్థాయిలో పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే లేటెస్ట్‌గా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ సమీకరణాలని ఒకసారి చూసుకుంటే…ఇక్కడ లీడ్ మారిందని తెలిసింది. ఉమ్మడి జిల్లాలో టీడీపీ లీడ్ లోకి వచ్చిందని తెలిసింది.

మామూలుగానే పశ్చిమ గోదావరి టీడీపీకి కంచుకోట…2014లో స్వీప్ చేసింది…కానీ 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడింది.. 15 సీట్లలో 13 వైసీపీ, 2 సీట్లు టీడీపీ గెలుచుకుంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకత మొత్తగట్టుకున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ లీడ్‌లోకి వచ్చిందని తెలిసింది.

ఒకసారి జిల్లాలో పార్టీల బలబలాల్ని పరిశీలిస్తే..జిల్లాలో వైసీపీకి గెలుపు అవకాశం ఉన్న సీట్లు మూడే అని తెలిసింది. కొవ్వూరు, చింతలపూడి, నిడదవోలు సీట్లలో ప్రస్తుతం వైసీపీ లీడ్‌లో ఉంది. ఇక ఉండి, పాలకొల్లు, ఉంగుటూరు, తణుకు సీట్లలో వైసీపీ లీడ్‌లో ఉంది. అటు భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో జనసేన స్ట్రాంగ్‌గా ఉందని తేలిందట. దెందులూరు, ఏలూరు, పోలవరం, ఆచంట, గోపాలాపురం సీట్లలో వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ ఉందని తెలిసింది. అలాగే నరసాపురం అసెంబ్లీలో వైసీపీ-జనసేన మధ్య టఫ్ ఫైట్ ఉందట.

కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది…టీడీపీ-జనసేన పొత్తు ఉంటే…టఫ్ ఫైట్ ఉన్న సీట్లు ఆ రెండు పార్టీలే గెలుచుకుంటాయని తెలిసింది. అదే సమయంలో కొవ్వూరు, చింతలపూడి సీట్లలో టీడీపీకి బలమైన అభ్యర్ధులు ఉంటే కాస్త వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది. మొత్తానికి చూసుకుంటే పశ్చిమలో టీడీపీకే కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది…పొత్తు ఉంటే టీడీపీ-జనసేనకు తిరుగుండదు.

Read more RELATED
Recommended to you

Latest news