దేశరాజకీయాలలో కీలక పరిణామాలు చోరుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీపైన లోక్ సభలో అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనితో గాంధీ కుటుంబానికి తీవ్ర అవమానం జరిగింది అని చెప్పాలి. లోక్ సభలో జరిగిన ఈ సంఘటన కారణంగా కేంద్రంలో రాజకీయాలు వేదందుకున్నాయి. రాహుల్ గాంధీకి జరిగిన ఈ అవమానానికి వ్యతిరేకంగా లోక్ సభలో మొత్తం 14 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ తీరును తప్పుబడుతూ నిరసన తెలుపుతున్నాయి. ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చూపిన చొరవ ఇప్పుడు ఆయన పదవికి గండం తెచ్చేలా ఉంది.
ఇప్పుడు లోక్ సభలో ఏకంగా స్పీకర్ పైనే అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న దిశగా ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. మరి వీరంతా ఏకపక్షముగా ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపైనే అవిశ్వాస తీర్మానం పెట్టాలా ? వద్దా ? అన్న అంశం ముడిపడి ఉంది.