ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదనే సంగతి తెలిసిందే…ఒక్క శాతం కూడా ఓట్లు లేవు..ఆ పార్టీకి ఒక్క వర్డ్ మెంబర్ గెలుచుకునే బలం లేదు..కానీ ఏపీ రాజకీయాలని నడిపించేది బీజేపీనే. కేంద్రంలోని పెద్దలు ఏపీ రాజకీయాలని నడిపిస్తున్నారు. వారు ఎవరికి మద్ధతుగా ఉంటే వారిదే రాష్ట్రంలో హవా అన్నట్లు పరిస్తితి ఉంది. ఇక కేంద్రానికి భయపడి ఇటు అధికారంలో ఉన్న జగన్, అటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రాజకీయం చేయాల్సి వస్తుంది. పవన్ ఎలాగో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు.
అయితే ఇప్పుడు బీజేపీ ఆడిస్తున్న గేమ్ చాలా డేంజరస్‌గా నడుస్తోంది..ఆ పార్టీ ఎవరిని అడ్డుపెట్టుకుని ఎవరికి చెక్ పెడుతుందో అర్ధం కాకుండా ఉంది. గత ఎన్నికల్లో కేంద్రం సపోర్ట్ పూర్తిగా జగన్‌కే ఉందన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదిపి, జగన్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది..వ్యవస్థలు సైతం జగన్‌కు అనుకూలంగా నడిచిన పరిస్తితి కనిపించింది. అసలే బాబుపై వ్యతిరేకత, వైసీపీకి అనుకూల పవనాలు, జనసేన ఓట్లు చీల్చడం, బీజేపీ సపోర్ట్..వెరసి జగన్ సీఎం అయ్యారు.
ఇక నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని బాబు చూస్తున్నారు. ఇదే క్రమంలో మొదటగా కలిసొచ్చే పవన్‌ని దగ్గర చేసుకుంటున్నారు. పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెప్పి, బాబుకు మద్ధతుగా ఉన్నట్లు కనిపించారు. సరే వీరితో బీజేపీ కలిసొస్తే..కేంద్రం సపోర్ట్ ఉంటుంది..జగన్‌కు చెక్ పెట్టవచ్చని అనుకున్నారు.
కానీ ఏపీలో రాజకీయ సమీకరణాలని బీజేపీ మార్చేసింది. పవన్‌తో బాబు భేటీ అయితే, పవన్ ఏమో మోదీని కలిశారు. ఆ తర్వాత జగన్, మోదీని కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపి అనుకూల విశ్లేషకులు ఏం అంటున్నారంటే.. చంద్రబాబు వెళ్లి పవన్‌ని కలిసారు. పవన్ వెళ్లి మోదీని కలిసారు. మళ్లీ ఆ మోది వచ్చి జగన్‌ని కలిసారు. దీనిని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే జగన్ పాలనకి బీజేపీ మద్దతుంది. ఆ బీజేపీని పవన్ కళ్యాణ్ వదలలేకపోతున్నారు. అలాంటి పవన్‌ని పట్టుకుని బాబు ఏదో మార్పు సాధిస్తామనే భ్రమలో ఉన్నారని అంటున్నారు. అంటే ఎట్టి పరిస్తితుల్లో పైనున్న బీజేపీకి బాబు సపోర్ట్ చేయదని, అంటే బీజేపీ-పవన్ కలిసి పోటీ చేసి ఓట్లు చీల్చి, మళ్ళీ జగన్‌ని గెలిపించడమే లక్ష్యంగా వెళ్తారని చెబుతున్నారు. ఇక చివరికి బలయ్యేది బాబు అని అంటున్నారు.