ఎడిట్ నోట్: కారు + కాంగ్రెస్ x కమలం..!

-

తెలంగాణలో రాజకీయాలు ఈ మధ్య చాలా ఆసక్తికరంగా మారిపోయాయి…ఎవరు ఎవరిపై ఎప్పుడు పోరాటం చేస్తారో…అసలు క్లారిటీ రావడం లేదు. మామూలుగా తెలంగాణలో త్రిముఖ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే…టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య వార్ నడుస్తోంది…అయితే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు నెక్స్ట్ ఎలాగైనా టీఆర్ఎస్ ని గద్దె దించి అధికారంలోకి రావాలని గట్టిగా ట్రై చేస్తున్నాయి. ఇటు టీఆర్ఎస్ సైతం…ప్రతిపక్షలకు ఛాన్స్ ఇవ్వకుండా మూడో సారి అధికారంలోకి రావాలని చూస్తుంది.

అయితే ఈ సారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం చాలా కష్టమని ఇటీవల వచ్చిన సర్వేలు చెబుతున్నాయి…ఈ సారి మూడు పార్టీల మధ్య గట్టి ఫైట్ నడుస్తుందని తెలుస్తోంది. ఇక్కడ మూడు పార్టీల మధ్య పోటీ ఉంటే టీఆర్ఎస్ మాత్రం..బీజేపీనే టార్గెట్ చేస్తూ ముందుకెళుతుంది…అంటే తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో…గులాబీ నేతలు..కమలం పార్టీనే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువే. అయితే ఈ మధ్య వచ్చిన సర్వేలో కాంగ్రెస్ మూడో స్థానంలోకి పడిపోయిందని తేలింది.

ఇంకో సర్వేలో బీజేపీ మూడో స్థానంలో ఉందని తేలింది…అయితే వీటిల్లో ఏదో నమ్మాలో క్లారిటీ లేదు…కానీ బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే బలమైన నాయకత్వం, కేడర్ ఉంది. మరి అలాంటప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ ని ఎక్కువ టార్గెట్ చేయాలి. కానీ కేసీఆర్ అలా చేయడం లేదు…కేవలం బీజేపీ టార్గెట్ గానే ముందుకెళుతున్నారు. పైగా కేంద్రంలోని మోదీ సర్కార్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు.

ఇలా చేయడం వల్ల రాజకీయంగా లబ్ది జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది…అదే సమయంలో జాతీయ స్థాయిలోబీజేపీ వ్యతిరేక పార్టీలకు కేసీఆర్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు..ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకు కూడా దగ్గరవుతున్నారనే డౌట్ కూడా ఉంది…ఇటీవల ఢిల్లీ స్థాయిలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో రాహుల్ తో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు. అలాగే ఆ మధ్య రాహుల్ కు మద్ధతుగా కేసీఆర్ మాట్లాడారు. దీంతో పై స్థాయిలో కాంగ్రెస్ కు కేసీఆర్ దగ్గరవుతున్నారని అనిపిస్తుంది.

కానీ రాష్ట్రంలో మాత్రం టి‌పి‌సి‌సి రేవంత్ రెడ్డి మాత్రం..కేసీఆర్ పై యుద్ధమే చేస్తున్నారు. కాకపోతే ఈ మధ్య రాష్ట్ర కాంగ్రెస్…కమలం పార్టీని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. సోనియా గాంధీని ఈడీ విచారణ చేస్తున్న నేపథ్యంలో..దానికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు…మోదీ సర్కార్ పై ఫైర్ అవుతున్నాయి. అంటే అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కూడా కమలం పార్టీనే టార్గెట్ చేస్తున్నాయి…ఇక కమలం పార్టీ…రెండు పార్టీలకు ధీటుగానే ముందుకెళుతుంది. మొత్తానికైతే తెలంగాణలో రాజకీయం కాస్త కన్ఫ్యూజ్ గానే ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news