డాక్టర్ల దగ్గర దాచకూడని విషయాలేంటో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గరా ఏదీ దాచకూడదంటారు. అవును, అది నిజమే. ఏదీ దాచకుండా చెబితేనే వారికి సమస్య క్లియర్ గా అర్థమై మనకి పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తారు. మనం సగం సగం చెప్పుకుంటూ పోతే వారి పరిష్కారం కూడా మన సమస్యని పూర్తిగా తొలగించలేకుండా అయిపోతుంది. ఐతే ఏ విషయాల్లో అబద్ధాలు చెప్పకూడదు, ఏ విషయాల్లోపూర్తిగా నిజాలే చెప్పాలి అనే విషయాలు తెలుసుకోవాలి. డాక్టర్ల దగ్గరకి వెళ్ళినపుడు ఏ విషయాల్లో ఖచ్చితంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.

మీ వయస్సు

ఒక్కో వయస్సు వారికి ఒక్కోలా ట్రీట్ మెంట్ ఉంటుంది. కాబట్టి వయస్సు దాచడం కరెక్ట్ కాదు. వయస్సు పరంగా వచ్చే కొన్ని వ్యాధులు కనుక్కోవాలంటే మీ సరైన వయస్సు తెలుసుకోవడం తప్పనిసరి. ఆ విషయంలో మొహమాటమేమీ లేకుండా చెప్పాలి. డాక్టర్ రాసే ప్రిస్కిప్షన్ కూడా వయసుకు తగ్గట్టే ఉంటుంది.

పొగ తాగే అలవాట్లు

నికోటిన్ అనేది రోగాలని తొందరగా నయం కాకుండా చేస్తుంది. అందువల్ల డాక్టర్లు అలాంటి వారికి సర్జరీలు చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరైతే అసలు సర్జరీ చేయకపోవచ్చు.

మందు అలవాటు

ఆల్కహాల్ వల్ల సర్జరీలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీకు మందు తాగే అలవాటు ఎక్కువగా ఉంటే సర్జరీలో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆల్కహాల్ అవవాటు ఉంటే ఖచ్చితంగా చెప్పాలి.

వైద్యుడి వద్దకి వెళ్ళిన తర్వాత సిగ్గు, మొహమాటం అన్నీ వదిలేసి మీ గురించి చెప్పండి. మీకు సరైన వైద్యం అందాలంటే అది తప్పనిసరి.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...