మందుబాబులకు అలర్ట్‌.. మద్యం దుకాణాలు బంద్‌ అయినై

-

తెలంగాణలో మందు బాబులకు షాకింగ్ న్యూస్. రాష్ట్రంలో మూడు రోజుల పాటు అన్ని రకాల మద్యం షాపులు మూతబడనున్నాయి. ఈనెల 13న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఈనెల 11వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్స్‌లు మూసేయాలని, ఈ సమయంలో మద్యం విక్రయించరాదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జారీ చేసిన నిబంధనలను అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏపీలో మందుబాబులకు కూడా షాకింగ్ న్యూస్. ఈ నెల 13న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జరుగనున్నాయి.

Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్.. తెలంగాణలోనూ 3 రోజులు మద్యం షాపులు బంద్‌ - NTV Telugu

ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు లిక్కర్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు.. అంటే, ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేపట్టింది. ప్రభుత్వ మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు,స్టార్‌ హోటళ్లు,నేవల్‌ క్యాంటీన్స్, టూరిజం బార్స్, మద్యం డిపోలు, కల్లు దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశించారు. అలాగే 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఆ రోజు కౌంటింగ్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news