సైకో ముఖ్యమంత్రిని భరించాల్సి రావడం దౌర్భాగ్యం : అచ్చెన్నాయుడు

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కుప్పం నుంచి నేడు యువగళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారని, కానీ జగన్ మోహన్ రెడ్డి పిచ్చి ముఖ్యమంత్రిని, సైకో ముఖ్యమంత్రిని భరించాల్సి రావడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. మూడున్నర సంవత్సరాలుగా ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ మూర్ఖుడు ఎప్పుడు మనమీద పడతాడోనని ఈ మూడున్నరేళ్లుగా నిద్రలేకుండా గడిపామని, ఇప్పుడీ మూర్ఖుడికి సరైన మొగుడు, మన యువ నాయకుడు లోకేశ్ వచ్చారని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. లోకేశ్ వారసత్వంతో రావడంలేదని, రాష్ట్ర భవిష్యత్ ను తిరగరాయాలని నాయకుడిగా వస్తున్నాడని ఉద్ఘాటించారు అచ్చెన్నాయుడు.

 

గతంలో లోకేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేశారని, రాష్ట్రంలో సీఎం జగన్ నియోజకవర్గం సహా 175 నియోజకవర్గాల్లో 20 వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు, తారు రోడ్లు వేశారంటే అందుకు లోకేశ్ కారణమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాత్రుళ్లు వీధి లైట్లుగా ఎల్ఈడీ బల్బులు వెలుగుతున్నాయంటే అందుకు కారణం లోకేశ్ అని అన్నారు. ఏపీ ప్రజలు గుక్కెడు నీళ్లు తాగుతున్నారంటే లోకేశ్ పంచాయతీ శాఖ మంత్రిగా అందించిన సమర్థ పాలన వల్లేనని స్పష్టం చేశారు. అలాంటి లోకేశ్ కు అవినీతి అంటించేందుకు జగన్ ప్రయత్నించాడని, తాను అవినీతికి పాల్పడినట్టు భావిస్తే నిరూపించుకో అని సవాల్ విసిరిన నాయకుడు లోకేశ్ అని అచ్చెన్న కొనియాడారు. జగన్ ఆ విధంగా సవాల్ చేయగలడా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సైకో జగన్ ఒకవైపు, ఐదు కోట్ల మంది ప్రజలు ఒకవైపు పోరాడుతున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news