బీజేపీకి బాబు దూరం..ఫిక్స్..పవన్ పొజిషన్ ఏంటి?

-

ఏపీలో ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ వస్తున్నట్లే కనిపిస్తుంది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో మొన్నటివరకు కాస్త అర్ధం అవ్వని పరిస్తితి. కానీ ఇప్పుడుపుడే క్లారిటీ వచ్చేస్తుంది. మొదట నుంచి టి‌డిపి-జనసేన-బి‌జే‌పి పొత్తు ఉంటుందని ప్రచారం వస్తున్న విషయం తెలిసిందే. అయితే బి‌జే‌పితో పొత్తులో ఉన్న పవన్…బి‌జే‌పిని కలుపుకుని టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. కానీ టి‌డిపితో కలవడానికి బి‌జే‌పి ఒప్పుకోవడం లేదు.

కలిసొస్తే జనసేనతో కలిసి పోటీ చేస్తామని, లేదంటే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బి‌జే‌పి అంటుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పిని వదులుకోవడానికి పవన్ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అదే సమయంలో చంద్రబాబు సైతం…కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి..బి‌జే‌పితో కలవాలని అనుకున్నారు. కానీ టి‌డి‌పి శ్రేణులకు మాత్రం బి‌జే‌పితో పొత్తు ఇష్టం లేదు. గత ఎన్నికల ముందు టి‌డి‌పిని దెబ్బతీయడంలో బి‌జే‌పి పాత్ర కూడా ఉంది. అలాగే బి‌జే‌పి..జగన్‌కు ఎలా సహకరిస్తుందో తెలిసిందే.

అసలు ఏపీలో బి‌జే‌పికి ఒక్క సీటు గెలుచుకునే బలం లేదు. పైగా ప్రజలు బి‌జే‌పిపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బి‌జే‌పిపొత్తు వద్దని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే బాబు మాత్రం కాస్త బి‌జే‌పి పట్ల సానుకూలంగా ఉన్నారు. కానీ ఎంతసేపటికి బి‌జే‌పి…జగన్ కు మేలు చేసే పనిలో ఉంది. పైగా టి‌డి‌పిని టార్గెట్ చేసి బి‌జే‌పి నేతలు విమర్శలు చేస్తున్నారు.

దీంతో టి‌డి‌పి నేతలు రివర్స్ అయ్యారు..బి‌జే‌పిపై విరుచుకుపడుతున్నారు. బి‌జే‌పికి ఒక్క సీటు గెలిచే బలం లేదని, పవన్ ని తమవైపు రానివ్వకుండా అడ్డుకుంటుందని ఫైర్ అవుతున్నారు. ఇలా టి‌డి‌పి నేతలు బి‌జే‌పిని టార్గెట్ చేయడంతో..ఇంకా బి‌జే‌పితో పొత్తుకు టి‌డి‌పి సిద్ధంగా లేదని తేలిపోయింది. అయితే ఇప్పుడు తేల్చుకోవాల్సింది పవన్ మాత్రమే..బి‌జే‌పిని వదిలి టి‌డి‌పితో కలిసి రావాలి..లేదంటే బి‌జే‌పితోనే ఉండాలి. అలా ఉండటం వల్ల గెలిచే ఛాన్స్ లేదు. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news