సర్వేలతో జోష్: ఫ్యాన్స్… బాబు – పవన్ కాంబో డేంజర్!

-

వరుసగా వస్తున్న నేషనల్ సర్వేలతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది..ఇంకా నెక్స్ట్ కూడా వైసీపీదే అధికారమని సర్వేలు చెప్పడంతో..వైసీపీ కార్యకర్తల ఆనందానికి అడ్డు లేదన్నట్లు పరిస్తితి ఉంది. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీ, అనుకూల మీడియా, అటు జనసేన…ఇలా అందరూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ వస్తున్నారు. అసలు జగన్ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా జగన్ అధికారంలోకి రారని అంటున్నారు.

అయితే ఇలా టీడీపీ అనుకూల మీడియా చేసే ప్రచారానికి చెక్ పెట్టేలా నేషనల్ సర్వేలు వచ్చాయి. ఇప్పటివరకు మూడు సర్వేలు వచ్చాయి. ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19, ఇండియా టుడే సర్వేలో 18, టైమ్స్ నౌ సర్వేలో 17-23 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని తేలింది..అలాగే ఓవరాల్ గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ 130 అసెంబ్లీ సీట్లు వరకు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇక్కడ సర్వేలు నిజమే అనే అనుకుందాం…ఇప్పుడు ఏపీలో వైసీపీ హవానే ఉందని అనుకుందాం.

ఈ సర్వేల ప్రకారం చూసుకుంటే గతం కంటే ఇప్పుడు వైసీపీకి సీట్లు తగ్గుతున్నాయి…ఇందులో ఎలాంటి డౌట్ లేదు…అంటే వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది..అటు టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది..కాకపోతే అధికారంలోకి వచ్చే సత్తా టీడీపీకి లేదు. సరే ఇదంతా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్తితి. మరి ఎన్నికల నాటికి ఇంకా మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు కదా…టీడీపీ ఇంకా పుంజుకునే ఛాన్స్ ఉంది..ఒకవేళ వైసీపీ పుంజుకుంటే ఇబ్బంది లేదు…అలా కాకుండా టీడీపీ పికప్ అయితే కష్టం.

2012 ఉపఎన్నికల్లో అలాగే వైసీపీ హవా కొనసాగింది…తీరా రెండేళ్లలో అంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంటే పరిస్తితి ఎలాగైనా మారే ఛాన్స్ ఉంది. అదే సమయంలో సర్వేలు టీడీపీ-జనసేన కాంబినేషన్ లో రావడం లేదు..ఒకవేళ చంద్రబాబు-పవన్ కలిస్తే సర్వే ఎలా ఉంటుందో ఒకసారి వస్తే అప్పుడు సీన్ అర్ధమవుతుంది. కాబట్టి వైసీపీ శ్రేణులు తొందరపడి సంబరాలు చేసుకోకుండా… పార్టీని గెలిపించడం కోసం ఇంకా కష్టపడితే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news