కేంద్రంపై మరోసారి కేటీఆర్ ఫైర్…. బీజేపీ పాలనలో అన్నీ కొరతే అంటూ ట్వీట్

టీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలు ఉప్పూనిప్పూలా ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు కేంద్రాన్ని, బీజేపీ పాలనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైఫల్యం వల్లే దేశంలో సమస్యలు ఏర్పడుతున్నాయని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా మోదీ పాలనను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. నాన్ ఫెర్ఫామింగ్ గవర్నమెంట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్భనం, పెరుగుతున్న ధరలపై ఇప్పటికే పలుమార్లు కేంద్రం ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇటీవల జరిగిన ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీని తూర్పారపట్టారు. 

తాాజాగా ఈ రోజు మరోసారి కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ట్వీట్ చేశారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత అంటూ.. అన్ని సమస్యలకు మూలం పీఎం మోడీకి విజన్ కొరత అంటూ ట్వీట్ చేశారు. ఇది ఎన్పీఏ గవర్నమెంట్ ఫెర్ఫామెన్స్ అంటూ విమర్శించారు.