పూజా హెగ్డే ధరించిన తెలుపు గౌన్ ధర ఎంతనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన ఫ్యామిలీతో బ్రిటన్ లో హాలీడే ట్రిప్ లో ఉంది. అక్కడ హ్యాపీగా తన కుటుంబ సభ్యులతో పలు ప్రాంతాలను సందర్శిస్తోంది.

తాజాగా ఈ అమ్మడు..ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ కు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ షేర్ చేసింది. అంతే ఇక..ఆ ఫొటోల్లో పూజా హెగ్డే ధరించిన బట్టల గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ అవుతోంది.

ఆక్స్ ఫర్డ్ లో దిగిన ఫొటో లు షేర్ చేసిన బుట్ట బొమ్మ..‘తాను ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ కు వెళ్లానని చెప్పొచ్చా?’ అని క్యాప్షన్ లో ప్రశ్నించింది. ఇక పూజా హెగ్డే ధరించిన తెలుపు గౌన్ పైన డిజైనర్స్ హేమంత్, నందిత‌ల పేర్లు లేబుల్ గా ఉన్నాయి. వాటిని చూసి నెటిజన్లు వావ్ అని అంటున్నారు. ఈ భామ ధరించిన డ్రెస్ ప్రైస్ ఎంతుంటుంది? అని సెర్చే చేశారు. అది రూ.15 వేలు అని తేలింది. దాంతో పూజ ధరించిన డ్రెస్ ధర తమ కు తెలిసిపోయిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పూజా హెగ్డే వైట్ డ్రెస్ లో గాగుల్స్ ధరించి..అలా స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టేసింది. పూజా నటించిన ‘ఆచార్య’ చిత్రం ఇటీవల విడుదలై ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ‘కబీ ఈద్ కబీ దివాళి’, రణ్ వీర్ సింగ్ తో ‘సర్కస్’ ఫిల్మ్ చేస్తున్న బుట్ట బొమ్మ…పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)