కే‌ఏ పాల్-కేసీఆర్ ఒక్కటే..జనసేన-బీజేపీకి నష్టమే..!

-

ఏపీలో బీఆర్ఎస్ ఏర్పాటు చేయడం..అందులోకి పలువురు నాయకులని తీసుకోవడం, అలాగే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించడం జరిగిపోయింది. ఇకపై ఏపీలో బీఆర్ఎస్ బలపడనుందని కేసీఆర్ అంటున్నారు..సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ లోకి వలసలు ఆగవని, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలోకి రావడానికి చూస్తున్నారని కేసీఆర్ అంటున్నారు.

ఇక ఊహించని రీతిలో ఏపీలో నాయకులు బీఆర్ఎస్ లో చేరబోతున్నారని తెలంగాణ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో ఏపీలో బీఆర్ఎస్ పై..అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో కేసీఆర్ ప్రభావం ఉండదని, కే‌ఏ పాల్ ఎలా పోటీ చేస్తున్నారో..అలాగే ఏపీలో కేసీఆర్ పోటీ చేస్తారని, ఎవరైనా పోటీ చేయవచ్చని మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో కే‌ఏ పాల్, కేసీఆర్ ప్రభావం ఉండదని, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. అటు పవన్ ప్రభావం కూడా లేదని అన్నారు.

 

అయితే ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై వైసీపీ స్పందించింది..ఇటు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు స్పందించాయి. కానీ ఏపీలో టీడీపీ-జనసేన స్పందించలేదు. ఇక ఏపీ ప్రజలను మోసం చేయడానికే తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ వస్తోందని,  ఆంధ్ర వాళ్ళలను కేసీఆర్ కుక్కలు అన్నారా? లేదా? అని..ఆంధ్ర వాళ్ళని తరిమి తరిమి కొడతానని కేసీఆర్ అన్నారా? లేదా? అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిలదీశారు.

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తును బలహీన పర్చేందుకే బీఆర్ఎస్ రూపంలో సీఎం కేసీఆర్ ఏపీ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టారని, తెలంగాణ ప్రజలను మోసగించినట్లుగానే.. ఏపీ ప్రజలను కూడా నమ్మించగలుగుతానని కేసీఆర్ అనుకుంటున్నారని తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. మొత్తానికి ఏపీలో కేసీఆర్ ఎంట్రీపై రకరకాల విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news