ఎడిట్ నోట్: నవంబర్@2023.!

-

నవంబర్ 2023…తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నెల..కొద్దిగా ఏమైనా మార్పులు జరిగితే డిసెంబర్ మొదటివారంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. అయితే మెయిన్ నవంబర్ అనే చెప్పాలి..ఎన్నికల షెడ్యూల్ రావడం, అభ్యర్ధులని ప్రకటించడం, నామినేషన్లు, ఎన్నికల ప్రచారం ఈ హడావిడి అంతా నవంబర్ లోనే ఉంటుంది. అయితే ఎన్నికల సమయం దగ్గరపడిపోతుంది. గట్టిగా చూసుకుంటే మరో 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇక ఈ ఎన్నికల్లో గెలవాలని అటు అధికార బి‌ఆర్‌ఎస్, ఇటు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బి‌జే‌పిలు చూస్తున్నాయి. ఎవరికి వారు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. అయితే గత రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ వైపు తెలంగాణ ప్రజలు నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఎటువైపు ఉన్నారో అర్ధం కాకుండా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఆలోచన ఎలా ఉందనేది క్లారిటీగా లేదు. రెండుసార్లు అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పట్ల అంత సంతృప్తిగా ఏమి లేరు. అలా అని రెండుసార్లు ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ పట్ల అనుకూలంగానూ లేరు. అటు రేసులోకి దూసుకొచ్చిన బి‌జే‌పికి ఫుల్ సపోర్ట్ లేదు.

ts polls

ఇలా మూడు పార్టీల విషయంలో ప్రజల్లో క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు ప్రజా నాడి ఏంటి అనేది తెలియడం లేదు. కానీ ఎన్నికల సమరం సిద్ధమైంది. ఇక రాష్ట్రంలో చిన్నాచితక పార్టీలు ఉన్నాయి..అవి ఎంతవరకు ఓట్లు చీలుస్తాయో అర్ధం కాకుండా ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. ఇక వారిని కే‌సి‌ఆర్ దగ్గర చేసుకున్నారు. వారితో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. కమ్యూనిస్టులని కలుపుకుంటే ఖమ్మం లాంటి జిల్లాలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది.

ఇక బి‌ఎస్‌పికి కొన్ని ఏరియాల్లో పట్టు ఉంది..ఈ పార్టీ కొన్ని ఓట్లు చీలుస్తుంది. అటు టి‌డి‌పికి సైతం కొన్ని స్థానాల్లో పట్టు ఉంది..ఆ పార్టీకి గెలిచే ఛాన్స్ లేదు..కానీ ఓట్లు చీల్చి ఏదొక పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఇటు షర్మిల పార్టీ సైతం గెలిచే ఛాన్స్ లేదు..కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయవచ్చని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ ఎన్నికలు ఈ సారి ఊహించని ట్విస్ట్‌లతో జరిగేలా ఉన్నాయి. చూడాలి మరి నవంబర్ లో ఎన్నికల పోరు ఏ స్థాయిలో ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news